Advertisement
Google Ads BL

చైతూ, సాయిపల్లవి కాంబో మూవీ సెట్స్ పైకి..!


శేఖర్ కమ్ముల- నాగ చైతన్య- సాయి పల్లవి సినిమా షూటింగ్ ప్రారంభం

Advertisement
CJ Advs

‘ఫిదా’ సంచలన విజయం తర్వాత శేఖర్ కమ్ముల- నాగ చైతన్య- సాయి పల్లవి క్రేజీ కాంబినేషన్‌లో సినిమా షూటింగ్ ఈ రోజు(సోమవారం) ప్రారంభమైంది. ఆన్ లొకేషన్‌లో జరిగిన పూజా కార్యక్రమంలో దర్శకుడు శేఖర్ కమ్ముల, హీరో నాగ చైతన్య, హీరోయిన్ సాయి పల్లవి, నిర్మాతలు సునీల్ దాస్ కె నారంగ్, ఎఫ్‌డిసి చైర్మన్ పి రామ్మోహన్ రావు, భరత్ నారంగ్, కో ప్రొడ్యూసర్ విజయ్ భాస్కర్, డిస్ట్రిబ్యూటర్లు సదానంద్, శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు. ఎసియన్ గ్రూప్స్ అధినేత సునీల్ నారంగ్, శేఖర్ కమ్ములకు స్క్రిప్ట్ అందించారు. శేఖర్ కమ్ముల తండ్రి శేషయ్య క్లాప్ ఇవ్వగా, డిస్ట్రిబ్యూటర్ సదానంద కెమెరా స్విచ్చాఫ్ చేశారు.

ఏమిగోస్ క్రియేషన్స్ సమర్పణలో శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ ఎల్ పి బ్యానర్ పై నారాయణ్ దాస్ కె నారంగ్, పి రామ్మోహన్ రావు నిర్మిస్తున్న ఈ మ్యూజికల్ లవ్ స్టొరీ షూటింగ్ హీరో నాగచైతన్య, సాయి పల్లవి కాంబినేషన్ సీన్‌తో మొదలైంది.

ఈ సందర్భంగా నిర్మాత పి. రామ్మోహన్ రావు మాట్లాడుతూ.. ‘‘శేఖర్ గారి దర్శకత్వంలో సినిమా నిర్మిస్తున్నందుకు చాలా ఆనందంగా ఉంది. మూడు షెడ్యూల్లో ఈ సినిమా నిర్మాణం జరుగుతుంది. ప్రస్తుతం మొదలైన షెడ్యూల్ పది రోజులు జరుగుతుంది. శేఖర్ కమ్ముల ఒక మంచి మ్యూజికల్ లవ్ స్టొరీని తెర మీద ఆవిష్కరించబోతున్నారు’’ అన్నారు.

దర్శకుడు శేఖర్ కమ్ముల మాట్లాడుతూ.. ‘‘విలేజ్ నుండి వచ్చి జీవితంలో ఏదో సాధించాలి అనుకునే ఇద్దరి మధ్య ప్రేమ కథ ఇది. ఫస్ట్ టైం ఒక మ్యూజికల్ లవ్ స్టొరీ లో నాగ చైతన్య, సాయి పల్లవి నటిస్తున్నారు. తెలంగాణ యాసని నాగ చైతన్య బాగా ఇష్టపడి నేర్చుకున్నాడు. నాగ చైతన్య పాత్ర ఈ సినిమాకు హైలెట్ అవుతుంది. సాయిపల్లవి ఈ కథకు పెర్ఫెక్ట్ గా సరిపోతుంది. నా సినిమాలలో మ్యూజిక్ బలంగా ఉంటుంది. ఇందులో ఆ బలం మరింతగా కనిపిస్తుంది. రెహ్మాన్ స్కూల్ నుండి వచ్చిన పవన్ ఈ సినిమాకు మ్యూజిక్ అందిస్తున్నాడు..’’ అన్నారు.

నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా నటిస్తున్న ఈ మూవీ లో నటించబోయే మిగతా నటీనటుల వివరాలు త్వరలో వెల్లడిస్తారు.

టెక్నికల్ టీమ్ :

ఆర్ట్: రాజీవ్ నాయర్

కెమెరా: విజయ్ సి కుమార్

మ్యూజిక్: పవన్

సహా నిర్మాత: విజయ్ భాస్కర్

పి.ఆర్.వో -జి.ఎస్.కె మీడియా

నిర్మాతలు: నారాయణ్ దాస్ కె నారంగ్, పి రామ్మోహన్ రావు

రచన,దర్శకత్వం: శేఖర్ కమ్ముల.

Sai Pallavi, Naga Chaitanya And Sekhar Kammula Film Update:

Shooting of Sai Pallavi, Naga Chaitanya’s film with Sekhar Kammula kickstarts
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs