Advertisement
Google Ads BL

‘వాల్మీకి’లో వరుణ్ పేరు తెలిసిపోయిందిగా!


కెరియర్‌ ప్రారంభం నుంచి విభిన్నమైన కథలకు.. విలక్షణమైన పాత్రలకు ప్రాధాన్యతనిచ్చే మెగా హీరో వరుణ్ తేజ్ ‘వాల్మీకి’లో డిఫరెంట్ పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్, టీజర్‌లు సినిమాను భారీగానే అంచనాలు పెంచేశాయి. అంతేకాదు.. ఈ సినిమా హిట్టయితే వరుణ్‌ ఇక వెనక్కి చూసుకోవాల్సిన అవసరం లేకుండా పోతుందని మెగా ఫ్యామిలీ, వీరాభిమానులు భావిస్తున్నారు. 

Advertisement
CJ Advs

సినిమా షూటింగ్ మొదలుకుని ఇప్పటి వరకూ ‘వాల్మీకి’ నుంచి వచ్చే అప్డేట్స్ కోసం మెగాభిమానులు, సినీ ప్రియులు ఎంతో ఆసక్తిగా వేచి చూస్తున్నారు. అయితే.. టీజర్‌ను బట్టి వరుణ్ పాత్రేంటో కాస్త తెలిసినప్పటికీ పూర్తి క్లారిటీ మాత్రం రాలేదు. తాజాగా తన పాత్ర, సినిమాలో తన పేరేంటి..? అనే విషయాన్ని వరుణ్ తేజ్ బయటపెట్టాడు.

‘సినిమాలో నా పాత్ర పేరు ‘గద్దలకొండ గణేశ్’. ఈ పాత్ర ప్రేక్షకులకు చాలా బాగా కనెక్టవుతుంది.. అందరినీ మెప్పిస్తుంది’ అని వరుణ్ చెప్పుకొచ్చాడు. కాగా సినిమాకు సంబంధించి ఇంకా ప్రమోషన్స్‌ను చిత్రబృందం షురూ చేయలేదు. త్వరలోనే ప్రీ రిలీజ్ ఈవెంట్ మొదలుకుని ప్రమోషన్స్‌కు ముహూర్తం పెట్టాలని దర్శకనిర్మాతలు భావిస్తున్నారట. ఇదిలా ఉంటే.. ‘వాల్మీకి’ సెప్టెంబర్ 20న విడుద‌ల చేయాల‌ని దర్శకనిర్మాతలు నిర్ణయించుకున్న సంగతి తెలిసిందే.

varun tej reveals his name in valmiki film:

varun tej reveals his name in valmiki film  
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs