Advertisement
Google Ads BL

వావ్.. అనేలా తెలుగు సినీ రథసారధుల ఫంక్షన్


అంగరంగ వైభవంగా తెలుగు సినీ రథసారధుల రజతోత్సవం వేడుక

Advertisement
CJ Advs

తెలుగు సినీ ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్ యూనియన్ తెలుగు సినీ రథసారధుల రజతోత్సవం కార్యక్రమంలో చినజీయర్ స్వామి, కృష్ణంరాజు, చిరంజీవి, రాజశేఖర్, మహేష్ బాబు, కృష్ణ, కోటా శ్రీనివాసరావు, జయప్రద, సుమలత, జయసుధ, రోజా రమణి, జీవిత రాజశేఖర్, అల్లు అరవింద్, సురేష్ బాబు, నీహారిక, నాగబాబు, కిషన్ రెడ్డి, రామ్ లక్ష్మణ్, సందీప్ కిషన్, రాశి ఖన్నా, రెజీనా, ప్రగ్యా జస్వాల్, పూజా హెగ్డే, ఎమ్.ఎల్.కుమార్ చౌదరి, గిరిబాబు, శ్రీకాంత్, అశ్వినిదత్, రాఘవేంద్రరావు, బోయపాటి శ్రీను, టి.సుబ్బిరామిరెడ్డి, సాయి ధరమ్ తేజ్, మారుతి, తనీష్, శివ బాలాజీ తదితరులు పాల్గొన్నారు.

ఈ కార్యక్రమంలో కె. రాఘవేంద్రరావు మాట్లాడుతూ.. ఈ మధ్య కాలంలో ఇంత గొప్ప ఫంక్షన్ చూడలేదు. మేనేజర్లు చేస్తున్న ఈ ఫంక్షన్ పెద్ద సక్సెస్ దిశగా ముందుకు వెళుతుంది. నేను ఇన్ని గొప్ప సినిమాలు చేయడానికి సహకరించిన అందరూ మేనేజర్స్‌కు థాంక్స్ తెలుపుతున్నాను.. అన్నారు.

గిరిబాబు మాట్లాడుతూ.. ప్రొడక్షన్ మేనేజర్లు సర్వీస్ చాలా అమూల్యమైనది. సినిమా కొబ్బరికాయలు కొట్టినప్పటినుండి గుమ్మడికాయ కొట్టేవరకు వారు సినిమాకు చాలా హెల్ప్ ఫుల్ గా ఉంటారు. వారు పది కాలాల పాటు చల్లగా ఉండాలని అన్నారు.

కృష్ణంరాజు మాట్లాడుతూ.. ప్రొడక్షన్ మేనేజర్స్ ఇంత మంచి ఫంక్షన్ చేస్తారని ఊహించలేదు. వారు తలుచుకుంటే సినిమా టైమ్ లో పూర్తి చెయ్యగలగు. తెలుగు పరిశ్రమలో నేను గత 50 ఏళ్ల నుండి ఎంతో మంచి మేనేజర్స్‌ను చూసాను. వారు భవిషత్తులో మరిన్ని మంచి కార్యక్రమాలు చేయాలని కోరుకుంటున్నా.. అన్నారు.

మహేష్ బాబు మాట్లాడుతూ.. ఈ ఫంక్షన్ లో చిరంజీవిగారిని కలవడం కొత్త ఎనర్జీని ఇచ్చింది. మేనేజర్స్ చేస్తున్న ఈ ఈవెంట్‌కు రావడం హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. భవిష్యత్తులో వారు మరిన్ని సక్సెస్ ఫుల్ ఈవెంట్స్ చెయ్యాలని కోరుకుంటున్నా అన్నారు.

దిల్ రాజు మాట్లాడుతూ.. మేనేజర్లు చేస్తున్న ఈ అద్భుతమైన కార్యక్రమానికి హాజరవ్వడం సంతోషం. నేను 32 సినిమాలు తీసాను కావున 32 లక్షలు మేనేజర్స్ యూనియన్‌కు ఇస్తున్నాను. నేను నిర్మించిన మంచి చిత్రాల్లో మేనేజర్స్ సహాయ సహకారాలు ఉన్నాయన్నారు.

చిరంజీవి మాట్లాడుతూ.. అందరికి నమస్కారం. మేనేజర్స్ సిల్వర్ జూబ్లీ రజతోత్సవం ఇంత వైభవంగా జరగడం ఆనందంగా ఉంది. ఎగ్జిక్యూటివ్ మేనేజర్లు ఎంత కష్టపడతారు, ఎంత శ్రమిస్తారు అనేది నేను చూసాను. సినిమా ఆఫీస్ తీసినప్పటి నుండి అది విడుదల అయ్యే వరకు శ్రమించేది మేనేజర్లు. సినిమా అనే అద్భుతమైన సౌధం అనుకుంటే మేనేజర్లు పునాదిరాళ్లు. షూటింగ్ జరుగుతున్న సమయంలో తక్కువ నిద్రపోయేది మేనేజర్లు కావున సినిమా సక్సెస్ లో వారి వంతు చాలా ఉంటుంది. సైరా సినిమా షూటింగ్ లొకేషన్ కోసం మా మేనేజర్ వారి కాళ్ళ మీద పడి అనుమతి తీసుకున్నారు, వారికి మా హృదయపూర్వక నమస్కారాలు. ఈ ఈవెంట్ ను విజయవంతం చెయ్యడానికి అందరూ స్వచ్చందంగా వచ్చాము అన్నారు.

తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ.. ఈ మహోత్సవం ఇంత గ్రాండ్‌గా చేసిన మేనేజెర్స్ యూనియన్‌కు అభినందనలు. సినిమా ఇండస్ట్రీలోని అతిరథ మహారధులు ఈ ఫంక్షన్ కు రావడం హర్షించదగ్గ విషయం. నేను భవిషత్తులో కూడా చిత్ర పరిశ్రమకు సహాయపడతాను. కుల, మతానికి అతీతంగా ఇండస్ట్రీలో ఉన్నవారందరు ఈ ఫంక్షన్‌కు రావడం జరిగింది. భవిష్యత్తులో వీరు మరిన్ని సక్సెస్ ఫుల్ ఈవెంట్స్ చెయ్యాలని కోరుకుంటున్నాను.. అన్నారు.

గౌరవ అధ్యక్షులు: ఎమ్.సీతారామరాజు

ప్రెసిడెంట్: అమ్మిరాజు కాసుమిల్లి

ప్రధాన కార్యదర్శి: ఆర్.వెంకటేశ్వర రావు

కోశాధికారి: కె.సతీష్

వైస్ ప్రెసిడెంట్: డి.యోగానంద్

వైస్ ప్రెసిడెంట్: కుంపట్ల రాంబాబు

జాయింట్ సెక్రటరీ: సురపనేని కిషోర్

జాయింట్ సెక్రటరీ: జి.నాగేశ్వర రావు

Celebrities speech at Cine Mahotsavam Event:

Cine Mahotsavam Event Highlights
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs