Advertisement
Google Ads BL

‘సాహో’ సుజిత్‌కు ఏమైంది.. ఏంటీ పుకార్లు!


‘సాహో’ డైరెక్టర్ సుజిత్ ఆరోగ్యంపై గత రెండ్రోజులుగా పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి. ఆయనకు వైరల్ ఫీవర్ వచ్చిందని.. ఆయన్ను కొన్ని రోజుల పాటు ఆస్పత్రిలో బెడ్ రెస్ట్ తీసుకోమన్నారని.. ఇలా రకరకాలుగా వెబ్‌సైట్ వార్తలు రాసేశాయి. అయితే ఇంతవరకూ సుజిత్ రియాక్ట్ అవ్వకపోవడంతో మరింత మసాలా జోడించి మరీ పుంకాలు పుంకాలుగా కథలు అల్లేశారు. 

Advertisement
CJ Advs

అయితే ఈ పుకార్లుపై సుజిత్ సన్నిహితులు క్లారిటీ ఇవ్వడంతో కాసింత పుకార్లకు ఫుల్ స్టాప్ పడినట్లైంది. సుజీత్‌కు తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నట్లు వస్తున్న వార్తలన్నీ అవాస్తవమేనని.. ఆయన ఆరోగ్యంగానే ఉన్నారని చెప్పుకొచ్చారు. ఆయనకు డెంగ్యూ ఫీవర్ వచ్చిందన్నది రూమర్సేనని.. నార్మల్ ఫీవర్ మాత్రమేనని.. అభిమానులు, సినీ ప్రియులు ఎవరూ ఆందోళన చెందాల్సిన అక్కర్లేదని స్పష్టం చేశారు.

ఇదిలా ఉంటే.. జ్వరం వస్తే ఇంత పెద్ద ఎత్తున వెబ్‌సైట్లు వార్తలు రాయడమేంటో మరి. మనుషులు అనగా.. అనారోగ్యం పాలవ్వరా.. దాన్ని నుంచి కోలుకోరా..? ఏంటో ఈ చిత్ర విచిత్రాలు అంటూ క్రిటిక్స్ విమర్శల వర్షం కురిపిస్తున్నారు. మరి ఇకనైనా ఇలాంటి చీల్లీ వార్తలు రాయడం ఆపుతారో లేకుంటే కంటిన్యూ చేస్తారో మరి.

Rumours On Saaho Director Sujith Health!:

Rumours On Saaho Director Sujith Health!  
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs