ఇదేంటి.. ‘సైరా’ కోసం దర్శకధీరుడు రాజమౌళి అలియాస్ జక్కన్న రంగంలోకి దిగడమేంటని కాసింత కన్ఫూజన్‌గా ఉంది కదూ.. అవును మీరు వింటున్నది నిజమే.. ‘సాహో’ కోసం RRR షూటింగ్‌కు కాస్త గ్యాప్ ఇచ్చి మరీ జక్కన్న రంగంలోకి దిగారట. ఇప్పటికే సినిమా షూటింగ్ పూర్తి చేసుకుని ఫైనల్ టచ్ గ్రాఫిక్స్ పనిలో చిత్రబృందం బిజిబిజీగా ఉంది. అయితే ఈ క్రమంలో రాజమౌళిని రంగంలోకి దింపిన రామ్ చరణ్.. సలహాలు, సూచనలు ఇవ్వాలని కోరారట. అందుకే గ్రాఫిక్స్ మొదలుకుని సినిమా నిడివి తగ్గించేందుకు ఎడిటింగ్ కూడా జక్కన్నే దగ్గరుండి చూసుకుంటున్నారని టాక్ నడుస్తోంది.
చిరంజీవి ఈ చిత్రాన్ని డ్రీమ్ ప్రాజెక్టుగా భావించగా.. చెర్రీ ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించారు. అందుకే ఈ సినిమాలో ఎలాంటి లోటు పాటులు ఉండకూడదని జక్కన్నను రామ్ చరణ్ రంగంలోకి దింపి దగ్గరుండి మరీ చూడమని కోరాడని సమాచారం. కాగా.. తెలుగు, హిందీ, తమిళ, మళయాళ, కన్నడ భాషల్లో ఈ సినిమా అక్టోబర్ 2న రిలీజ్ కాబోతోంది. అయితే నిజంగానే ‘సైరా’ కోసం జక్కన్న ‘చెక్కుడు’ మొదలుపెట్టారా..? లేకుంటే పుకార్లేనా అన్నది తెలియాల్సి ఉంది.