తన బాహుబలి 2 చిత్రం యొక్క రికార్డ్స్ తానే క్రాస్ చేయాలనీ ప్రభాస్ సాహో తో చాలా ట్రై చేసాడు కానీ మొదటి రోజు నుండే నెగటివ్ టాక్ రావడంతో ఈ సినిమా బాహుబలి 2ని క్రాస్ చేయడం కష్టం అని అర్ధం అయిపోయింది. ఇండియా మొత్తం బాహుబలి 2 ని క్రాస్ చేయాలనీ చూస్తుంది. కానీ సాధ్యం కావడంలేదు. ఈ ఊపులోనే మెగాస్టార్ చిరంజీవి వస్తున్నాడు. సైరా చిత్రంతో బాహుబలి 2 రికార్డ్స్ అన్ని క్రాస్ చేయాలనీ చూస్తున్నాడు మెగాస్టార్.
అసలే ఇది పాన్ ఇండియా సినిమా కావడం, సౌత్ తో పాటు నార్త్ లో హిందీ లో ఈమూవీ రిలీజ్ కావడంతో దీనిపై కోటి ఆశలు పెట్టుకున్నారు మెగా ఫ్యాన్స్. టాలీవుడ్ ఇండస్ట్రీలో రికార్డ్స్ ఏమన్నా ఉంటే అవి మెగా కాంపౌండ్ పేరిట మాత్రమే ఉండాలనేది మెగాభిమానుల లక్ష్యం. అందుకే అవుట్ ఫుట్ విషయంలో సైరా ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా తీర్చిదిద్దుతున్నారు. పైకి చెప్పకపోయినా సైరా టార్గెట్ బాహుబలి-2 మాత్రమే. రీసెంట్ గా రిలీజ్ అయినా ట్రైలర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చిన సంగతి తెలిసిందే. ఇక ఈమూవీ అన్ని భాషల్లో అక్టోబర్ 2న రిలీజ్ కానుంది.