Advertisement
Google Ads BL

‘జెర్సీ’ హిట్టిచ్చింది.. ‘జోడి’ షాకిచ్చింది!


నాని సరసన జెర్సీ సినిమాతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన శ్రద్ద శ్రీనాధ్.. ఆ సినిమాలో ఎమోషనల్ నటనతో సారాగా అదిరిపోయే ట్రెడిషనల్ పాత్రలో ఆకట్టుకుంది. జెర్సీ సినిమాలో నానికి సరిసమానమైన మార్కులు శ్రద్ద శ్రీనాధ్ కొట్టేసింది. నానితో రొమాన్స్ కానివ్వండి, సంసారం విషయంలో కానివ్వండి, బాధ్యతలు మోసే భార్యగా.. ఆమె పడే మనోవేదన కానివ్వండి, నానికి తల్లిగా కానివ్వండి... అన్ని విషయాల్లో నటనలో మంచి వేరియేషన్స్ చూపించింది. ఇక జెర్సీ సినిమా తరవాత ఆది సాయి కుమార్ తో జోడి సినిమాలో నటించింది.

Advertisement
CJ Advs

జోడి సినిమా గత శుక్రవారం విడుదలవడం ప్లాప్ కొట్టడం జరిగింది. ఆ సినిమా ప్లాప్ అయినా శ్రద్ద శ్రీనాధ్ కి అస్సలు పేరు రాలేదు. ఆమె కాంచనమాల పాత్రను దర్శకుడు అంతా వీక్ గా డిజైన్ చెయ్యడంతో ఆమె పాత్ర సినిమాలో తేలిపోయింది. సినిమాలో చాలా అందంగా కనిపించిప్పటికీ... నటనకు ప్రాధాన్యం లేకుండా పోయిన పాత్రతో శ్రద్ద శ్రీనాధ్ కి నెగిటివ్ మార్కులు పడ్డాయి. ఆమె పాత్రని దర్శకుడు కొద్దిగా మనసు పెట్టి రాసుంటే.. ఆమె పాత్ర హైలెట్ అయ్యేది. ఇక జోడి సినిమా తర్వాత శ్రద్ద శ్రీనాధ్ కి తెలుగులో మరో సినిమాలేదు. కానీ తమిళనాట మాత్రం రెండు సినిమాల్తో బిజీగా వుంది. గ్లామర్‌గా కాకపోయినా... నటన పరంగా శ్రద్ద మంచి టాలెంట్ ఉన్న నటి. మరి జోడి సినిమా చూసాక మన యంగ్ హీరోలెవరూ ఆమెకి ఛాన్స్ ఇచ్చే అవకాశం లేదు.

Jersey Heroine Shraddha Srinath Gets flop with Jodi:

Jodi gets negative Talk at Box Office
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs