Advertisement
Google Ads BL

సహాయం చెయ్యబోయి ఇరుకున పడ్డ బన్నీ వాసు!


టాలీవుడ్ జూనియర్ ఆర్టిస్ట్ సునీత బోయ పేరు గత కొన్నిరోజులుగా మీడియా, సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వినిపిస్తున్న సంగతి తెలిసిందే. ప్రముఖ నిర్మాత బన్నీ వాసుపై సంచలన ఆరోపణలు చేయడం.. ఆయన తనను మోసం చేశారని ఫిల్మ్ చాంబర్‌ గేటుకు తనకు తానుగా గొలుసులతో కట్టేసుకోవడం.. ఆమె తండ్రితో గీతా ఆర్ట్స్ ఆఫీస్ దగ్గర నిరసన తెలపడం ఇలా వరుస ఘటనలతో సునీత హాట్ టాపిక్ అయ్యింది. అయితే ఈ మొత్తం వ్యవహారంపై ఇప్పటికే బన్నీ వాసు 9 నిమిషాల నిడివి గల ఓ వీడియో క్లారిటీ ఇచ్చినప్పటికీ ఈ వివాదం మాత్రం సద్దుమణగలేదు.

Advertisement
CJ Advs

బన్నీవాసు-సునీత మధ్య అసలేం జరిగింది!

జనసేనలో కాస్త యాక్టివ్ మెంబర్‌గానే సునీత పనిచేసింది. ఈ క్రమంలో నిర్మాత బన్నీ వాసును కలిసి సినిమాల్లో చాన్స్‌ల కోసం ప్రయత్నాలు షురూ చేసింది. అంతేకాదు.. పాలకొల్లులో ఎవరో ఒకరి దగ్గర ఫోన్ నెంబర్ తీసుకొని మెసేజ్ చేయటం మొదలుపెట్టింది. దానికి బన్నీ వాసు నుంచి ఎలాంటి రిప్లై రాకపోవటంతో జనసేన ఆవిర్భావ సభలో కలిసి అంతా చెప్పింది. మెగా అభిమాని కావటంతో వాళ్ళ డైరెక్షన్ డిపార్ట్మెంట్‌ని సంప్రదించమని చెప్పారు. సునీత వాళ్ల నాన్న అనారోగ్యానికి సపోర్ట్ చేస్తానని చెప్పాడు. 

చేతిపై బన్నీ వాసు టాటూ..!

ఆ తర్వాత సునీత బోయ చేతిపై బన్నీ వాసు టాటూ వేసుకొని ఆయన అంటే ఇష్టమని ఫేస్ బుక్ లైవ్ పెట్టి చెప్పటమే కాకుండా గీతా ఆర్ట్స్ ఆఫీస్‌కు వెళ్లి గొడవ చేయటంతో పోలీసులకు అప్పజెప్పారు. దీంతో పిచ్చి ముదిరి గీతా ఆర్ట్స్-2 ఆఫీస్‌లో ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించడం మొదలుపెట్టింది. సోషల్ మీడియాలో రకరకాలుగా ఇబ్బంది పెడుతూ వచ్చింది.

 

అడిగే పద్ధతి ఇది కాదేమో..!

సహాయం చెయ్యబోయిన వ్యక్తిని విమర్శిస్తే ఎవరు మాత్రం ముందుకు వస్తారు. ఇప్పటికే మీడియాలో వచ్చిన కొన్ని వార్తలు చూసి కొంతమందిని చదివించే మంచి మనసున్న వ్యక్తి. ఈ మధ్యనే హైద్రాబాద్‌లో జరిగిన ఒక ప్రమాదంలో ప్రాణం పోయిన వ్యక్తి కుటుంబాన్ని వారి పిల్లల చదువుకు బన్నీవాసు సహాయం చేస్తున్నాడు. సో.. మొత్తానికి చూస్తే సునీత సహాయం అడిగే పద్దతి అయితే ఇది కాదేమోనని దీన్ని బట్టి చూస్తే స్పష్టంగా అర్థమవుతోంది. ఇప్పటికైనా సునీత మనసు మార్చుకుంటుందో లేకుంటే ఇలాగే పిచ్చి పిచ్చిగా ప్రవర్తిస్తుందో అంటూ నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.

News About Sunitha boya- Bunny vasu issue:

News About Sunitha boya- Bunny vasu issue
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs