Advertisement
Google Ads BL

ఇస్రో సైంటిస్టుల కోసం మహేశ్ ‘మహర్షి’ డైలాగ్!


భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) అత్యంత ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన చంద్రయాన్-2 చివరి నిమిషంలో విఫలమైన విషయం విదితమే. చంద్రయాన్-2 విఫలం కావడంతో బెంగళూరులోని ఇస్రో ప్రధాన కార్యాలయంలో మౌనం రాజ్యమేలింది. ప్రధాని మోదీతో సహా, ఇస్రో ఛైర్మన్, శాస్త్రవేత్తలు, తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. ఈ ప్రయోగం విఫలం కావడంపై సినీ రాజకీయ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా స్పందిస్తున్నారు.

Advertisement
CJ Advs

తాజాగా టాలీవుడ్ సూపర్‌స్టార్ మహేశ్ బాబు స్పందిస్తూ.. ఇస్రో సైంటిస్టులకు సెల్యూట్ చేశారు. ‘మీరే మా నిజమైన కథానాయకులు. మీ వెంటే మేమున్నాం. మీలో ప్రతి ఒక్కరికీ వందనం చేస్తున్నాను. ఇది మీ విజయగాథకు ఆరంభం మాత్రమే. మున్ముంథు మరెంతో సాధించాల్సి ఉంది’ అని మహేశ్ ట్విట్టర్‌లో రాసుకొచ్చారు.

అంతటితో ఆగని మహేశ్.. ‘మహర్షి’ సినిమాలోని పాపులర్ డైలాగ్‌ను సైతం వాడేశారు. ‘విజయం ఓ గమ్యం కాదు.. అదొక ప్రయాణం మాత్రమే’ అని సైంటిస్టులను ప్రోత్సహిస్తూ మహేశ్ ట్వీట్ చేశారు. ఈ ట్వీట్‌కు మహేశ్ వీరాభిమానులు, నెటిజన్లు పెద్ద ఎత్తున రియాక్ట్ అవుతున్నారు.. అంతేకాదు అభిమాను హీరో ట్వీట్‌ను షేర్ల వర్షం కురిపిస్తున్నారు.

Mahesh Babu invokes dialogue from Maharshi to praise the efforts of ISRO scientists:

Mahesh Babu invokes dialogue from Maharshi to praise the efforts of ISRO scientists  
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs