Advertisement
Google Ads BL

మూడు భారీ సినిమాల్లో చాన్స్ కొట్టేసిన షాలినీ!


‘షాలినీ పాండే’ని టాలీవుడ్ సినీ ప్రియులకు కొత్తగా పరిచయం చేయనక్కర్లేదు. మరీ ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల యూత్‌కు ఈ ముద్దుగుమ్మ గురించి చెప్పనక్కర్లేదు. ఎందుకంటే దాదాపు అందరూ ‘అర్జున్ రెడ్డి’ సినిమా చూసే ఉంటారు గనుక. ఈ మూవీ చూసిన సినీ ప్రియులకు షాలిని ఎప్పటికీ గుర్తుండిపోతుంది. ‘అర్జున్ రెడ్డి’లో హాట్ హాట్‌గా అందాలు ఆరబోసిన తర్వాత పెద్దగా టాలీవుడ్‌లో అవకాశాలు రాలేదు. అంతేకాదు.. ఈ ముద్దుగుమ్మ పని ఇంతటితో అయిపోయిందని అందరూ భావించారు. అయితే ఇన్ని రోజులు చాన్స్‌ల కోసం వేచి చూసిన ఈ ముద్దుగుమ్మకు మూడు భారీ చిత్రాల్లో నటించే అవకాశం వచ్చిందట.

Advertisement
CJ Advs

అయితే ఒక్కసారిగా నక్కతోక తొక్కినట్లుగా ఈ ముద్దుగుమ్మ ఒకట్రెండు కాదు ఏకంగా మూడు సినిమాల్లో.. అది కూడా బాలీవుడ్‌లో నటించే అవకాశం రావడంతో ఆనందానికి అవధుల్లేకుండా పోయాయట. యష్ రాజ్ ఫిల్మ్స్ బ్యానర్లో 3 భారీ సినిమాల్లో చేయడానికి డీల్ కుదుర్చుకుందని విశ్వసనీయ వర్గాల సమాచారం. అయితే ఈ మూడింటిలో ఒకటి రణ్‌వీర్ సింగ్‌తో సినిమా ఉందట. మొత్తానికి చూస్తే ఇన్ని రోజులు వేచి చూసినప్పటికీ ఈ భామ మాత్రం లక్కీ చాన్స్ కొట్టేసిందని చెప్పుకోవచ్చు. అయితే ఈ మూడు సినిమాలు షాలినీ పాండే దశ తిరుగడం ఖాయమని.. స్టార్ హీరోయిన్‌గా ఎక్కడికో ఎదిగిపోతుందని అనే నడుస్తోంది. మరి ఏ మాత్రం సక్సెస్ అవుతుందో..? అసలు ఈ మూడు సినిమాల్లో చాన్స్ వచ్చినట్లు వస్తున్న వార్తల్లో ఎంత మాత్రం నిజం ఉందో తెలియాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే మరి.

News About Arjun Reddy Actress Shalini Pandey :

News About Arjun Reddy Actress Shalini Pandey   
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs