Advertisement
Google Ads BL

ప్రభాస్ తదుపరి సినిమాపై ‘సాహో’ ఎఫెక్ట్!


ప్రభాస్ లేటెస్ట్ చిత్రం ‘సాహో’ నెగటివ్ టాక్‌తో కలెక్షన్స్ దుమ్మురేపుతోంది. లాంగ్ వీకెండ్‌లో ఈమూవీ రిలీజ్ అవ్వడం దీనికి ప్లస్ అయింది. ఓపెనింగ్స్‌తో మొదటి మూడునాలుగు రోజుల్లో కలెక్షన్స్‌తో దున్నేసింది ఈమూవీ. కానీ 5వ రోజు నుండి దీని పరిస్థితి అర్ధం అయిపోయింది. ప్రభాస్ కు హిందీ లో మంచి క్రేజ్ ఉండడంతో అక్కడ ఈ మూవీ నిలబడగలిగినా కానీ మిగిలిన చోట్ల మాత్రం దారుణంగా ఫెయిలయింది. ముఖ్యంగా తమిళ, మలయాళ భాషలలో డిజాస్టర్‌ అయింది ఈమూవీ.

Advertisement
CJ Advs

ఇక తెలుగు రాష్ట్రాల్లో ఈమూవీ కూడా భారీ నష్టం తప్పదనిపిస్తోంది. కేవలం ఒక్క సినిమా అనుభవం ఉన్న సుజీత్ లాంటి డైరెక్టర్ పై ఇంత పెద్ద సినిమా పెట్టడం అంటే మాములు విషయం కాదు. అతను అర్ధం కానీ స్క్రీన్‌ప్లేతో రెగ్యులర్ స్టోరీతో సినిమా తీసాడు. దాని ఫలితమే ఇది. అందుకే ప్రభాస్‌తో పాటు యువి క్రియేషన్స్‌ వాళ్లు కూడా అలర్ట్‌ అయ్యారు. జిల్ లాంటి ఒక్క సినిమా అనుభవం ఉన్న రాధాకృష్ణతో ప్రభాస్ ఓ సినిమా చేస్తున్నాడు. ఆల్రెడీ కొంచం షూటింగ్ కూడా అయిపోయింది. ఇప్పుడు ఆ సినిమాను సాహో రిజల్ట్ సరిగా రాకపోవడంతో ఆపేసారు.

మరోసారి ఆ సినిమా కథపై కసరత్తులు చేసి ఫ్రెష్‌గా జనవరి నుంచి షూట్‌కి వెళ్తారు. ఈలోగా ప్రభాస్ తన లుక్ పై ఫోకస్ పెట్టనున్నాడు. హిందీలో తనకి మంచి మార్కెట్ ఉంది కాబట్టి దాన్ని పాడు చేసుకోకుండా ఈ క్రేజ్‌ని ఇలాగే కొనసాగించేలా సినిమాలు చేయాలని చూస్తున్నాడు.

Saaho Effect on Prabhas Next Film :

Prabhas next Film John stopped
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs