Advertisement
Google Ads BL

‘సైరా’ కోసం ఖాన్‌లు రంగంలోకి దిగుతారా?


సాహో‌కి కనీసం యావరేజ్ టాక్ పడినా.. నిర్మాతలు, బయ్యర్లు సేఫ్ అయ్యేవారు. అడ్డదిడ్డంగా పెట్టుబడి పెట్టి.. సినిమాలో కంటెంట్ లేకుండా. ఎంత ప్రమోషన్ చేసిన ఉపయోగం ఉండదు అనేది సాహోతో తేలిపోయింది. ప్రభాస్ క్రేజ్ తో వన్ మ్యాన్ ఆర్మీలా బాలీవుడ్ నటులను వెంటేసుకుని సాహో ని ప్రమోట్ చేసినా.. ప్లాప్ టాక్ తో ఉపయోగం లేకుండా పోయింది. అయితే సాహో దెబ్బకి సై రాని కొన్న బాలీవుడ్ బయ్యర్లు పడుతున్న టెన్షన్ ని సైరా నిర్మాత రామ్ చరణ్ కనిపెట్టినట్టుగా ఉన్నాడు. అందుకే రామ్ చరణ్ కొత్త ఎత్తుగడ వేసినట్లుగా తెలుస్తుంది.

Advertisement
CJ Advs

అదేమిటంటే సైరా సినిమా వచ్చేనెల 2న విడుదల కాబోతుంది. అందుకే సై రా ప్రమోషన్స్ ని చాలా ప్లాన్డ్ గా చరణ్ చేపట్టబోతున్నాడట. అతి పెద్ద మార్కెట్ అయిన హిందీలో సై రాని బలంగా చూపించి క్రేజ్ సంపాదించాలంటే భారీ ప్రమోషన్స్ అవసరం. ఎలాగూ అమితాబ్ సైరా ప్రమోషన్స్ కి వస్తారు. ఇక సై రా స్పెషల్ ప్రమోషన్స్ కోసం రామ్ చరణ్ తనకు సన్నిహితులైన అమీర్ ఖాన్, సల్మాన్ ఖాన్ వంటి స్టార్ హీరోలతో సై రా సినిమాపై పాజిటివ్ మాటలు నాలుగు మాట్లాడించాలని ప్లాన్ చేస్తున్నాడట. మాములుగా తెలుగు సినిమాలంటే చిన్న చూపు చూసే అమీర్, సల్మాన్ లు చరణ్ చెబితే ఒప్పేసుకుని సై రాని ఏ మాత్రం ప్రమోట్ చేస్తారో చూడాలి.

Ram Charan New Plan for Sye Raa Promotions:

Bollywood Khans for Sye RAA Promotions
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs