‘కుమారి 21 ఎఫ్’ తో యూత్‌ని ఉర్రూతలూగించిన హెబ్బాపటేల్.. రాజ్ తరుణ్‌తో చాలా సినిమాలు చేసినా.. అమ్మడుకి బ్రేకిచ్చే సినిమా ఒక్కటి పడలేదు. హాట్ హాట్ అందాలతో సినిమాల్లో అందాలు ఆరబోసిన హెబ్బా అందాలకు దర్శకనిర్మాతలెవరు టెంప్ట్ కాలేదు. దానితో అవకాశాలు లేక సోషల్ మీడియాలో హాటెస్ట్ ఫొటోస్ ని పోస్ట్ చేస్తూ సినిమా అవకాశాలు కోసం ఎదురు చూవుతున్న హెబ్బకి ఈ మధ్యనే ఓ సినిమాలో హీరోయిన్ ఆఫర్ వచ్చింది. ఇక ఈ సినిమాతో హెబ్బా కెరీర్ ఊపందుకుంటుంది అనుకునేలోపు.. ఇప్పుడు హెబ్బా విలనవతారం ఎత్తబోతుందనే న్యూస్ వినబడుతుంది.
నితిన్ - రష్మిక జంటగా వెంకీ కుడుముల దర్శకత్వంలో తెరకెక్కుతున్న భీష్మ సినిమాలో హెబ్బా కూడా నటించబోతుందని.. అది కూడా విలన్ గా అనే న్యూస్ హైలెట్ అయ్యింది. భీష్మ సినిమా కథ మొత్తం విలన్ పాత్ర చుట్టూతానే తిరుగుతుంది.. అందుకే అవకాశాలు లేని హెబ్బా పటేల్ విలన్ రోల్ అయినా ఓకే చెప్పిందట. అందులోనూ హీరోయిన్ కన్నా ఎక్కువగా విలన్ రోల్ కే ఇంపార్టెన్స్ ఉండడంతో ఈ హాట్ గర్ల్ మారు మాట్లాడకుండా ఒప్పేసుకుందట. మరి హాట్ హెబ్బా విలన్ రోల్ లో ఎలా ఉండబోతుందో అంటూ అప్పుడే అందరిలో ఆసక్తి క్రియేట్ అవుతోంది.