టాలీవుడ్ జూనియర్ ఆర్టిస్ట్ సునీయ బోయ గత కొన్ని రోజులుగా ఇటు మీడియాలో.. అటు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయిన సంగతి తెలిసిందే. తనకు అవకాశాలు ఇప్పిస్తానని చెప్పి నిర్మాత బన్నీ వాసు మోసం చేశాడని సునీత ఆరోపిస్తోంది. వాస్తవానికి అసలు విషయం ఇదయితే కొన్ని చానెల్స్, వెబ్‌సైట్స్ ఇష్టానుసారం వార్తలు రాసేశాయి. ఈ వ్యవహారంపై ఫేస్‌బుక్ వేదికగా ఆమె స్పందిస్తూ మరోసారి క్లారిటీ ఇచ్చుకుంది.
సునీత మాటల్లోనే...‘బన్నీ వాసు గారు నన్ను సెక్సువల్ హెరాస్మెంట్ చేయలేదు దయచేసి తప్పుడు ప్రచారం చేయకండి. అవాస్తవ ప్రచారాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను. జనసేన పార్టీలో కీలకంగా ఉన్న సమయంలో నేను బన్నీ వాసుని ఒకటి రెండు సార్లు స్వయంగా కలిశాను. ఆ తర్వాత బన్నీ వాసు కలవడానికి ప్రయత్నించినప్పటకి ఆయన అపాయింట్మెంట్ దొరకలేదు. ఆయన్ని కలవడానికే నేను నిరసన తెలియజేస్తున్నాను. బన్నీ వాసుపై తప్పుడు ప్రచారాలు చేయడం సరికాదు. బన్నీవాసుపై దయచేసి తప్పుడు ప్రచారం చేయకండి’ అని సునీత చెప్పుకొచ్చింది.