Advertisement
Google Ads BL

‘టి మా’కు టీమ్ వీరే..!!


‘టి మా’ అసోసియేషన్‌ అభివృద్ధిలోకి రావాలన్నది  నా కోరిక- సీనియర్ నటి, ‘టి మా’ ఉపాధ్యక్షురాలు గీతాంజలి 

Advertisement
CJ Advs

తెలంగాణ ఫిలించాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ ఛైర్మన్‌ డా. ప్రతాని రామకృష్ణ గౌడ్‌ నూతనంగా ఏర్పాటు చేసిన  ‘టి మా’ (తెలంగాణ మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌’ కార్యవర్గ సభ్యులను ఈ రోజు హైదరాబాద్‌లో ప్రకటించారు. ‘టి మా’  అసోసియేషన్‌ ప్రెసిడెంట్‌గా జెవిఆర్‌, వైస్‌ ప్రెసిడెంట్స్‌గా సీనియర్‌ నటి గీతాంజలి, నటుడు బాలాజీ, హీరో దిలీప్‌ రాథోడ్‌,  జనరల్ సెక్రటరీగా స్నిగ్ధ మద్వాని, జాయింట్‌ సెక్రటరీస్ గా నటుడు కిరణ్‌, లత, ఇమ్మడి ధర్మారెడ్డి, ఆర్గనైజింగ్ సెక్రటరీస్‌గా వై.శ్రీనివాస్, ఆదర్శిని, యోగితో పాటు ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబెర్స్ గా గుండు రవి తేజ, ప్రేమ్, శ్రీశైలం, గీత సింగ్, గాయత్రీ, మహాలక్ష్మి, టి. న్యూస్ రాజేష్, ప్రవీణ, మమత, దయ ఎన్నికయ్యారు. 

ఈ సందర్భంగా డా.ప్రతాని రామకృష్ణ గౌడ్‌ మాట్లాడుతూ... ఇప్పటికే  తెలంగాణ ఫిలించాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌లో 85 సినిమాలకు సెన్సార్‌ కార్యక్రమాలు  పూర్తి చేశాం. అలాగే చాలా సినిమా టైటిల్స్ రిజిస్ట్రేషన్  చేశాం. మా ఛాంబర్‌లో మెంబర్సైన నిర్మాతలను అన్ని విధాల ఆదుకుంటున్నాం. ఇక ఇప్పటి ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడుగారు గతంలో కేంద్రంలో సినిమాటోగ్రఫీ మంత్రిగా వ్యవహరిస్తోన్న సమయంలో మా ‘టియఫ్‌సిసి’కి పర్మిషన్‌ ఇప్పించారు. వారికి పత్రికాముఖంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నా. మా ఛాంబర్‌లో సభ్యులైన వారికి హెల్త్‌కార్డ్స్‌తో పాటు అనేక రకాలుగా ఆర్థిక సాయం అందిస్తున్నాం. ఇప్పటికే చాలా మంది వాటిని ఉపయోగించుకోవడం కూడా జరుగుతోంది. ఇక మా ఛాంబర్‌ కేవలం తెలంగాణ నటీనటులకు చెందినది మాత్రమే కాదు. రెండు రాష్ట్రాలవారికి మెంబర్స్‌ అయ్యే అవకాశం ఉంది. ఆల్‌ ఇండియా వైజ్‌గా ఐదువేల మందికి పైగా నటీనటులు, సాంకేతిక నిపుణులు మా చాంబర్‌లో మెంబర్స్‌గా ఉన్నారు. ఇక ఒక మంచి ఉద్దేశంతో ఈ రోజు ‘టి మా’ (తెంగాణ మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌) ప్రారంభించాం. అందరి ఆమోదంతో ‘టి మా’ అధ్యక్షులుగా జెవిఆర్‌, ఉపాధ్యక్షులుగా  సీనియర్‌ నటి గీతాంజలిగారిని ఎన్నుకోవడం ఎంతో ఆనందంగా ఉంది. వారి వారి బాధ్యతలు సక్రమంగా నిర్వర్తిసారని ఆశిస్తున్నా. ఇక ఇప్పటికే తెలంగాణ స్టేట్‌ ఫిలించాంబర్‌ ఒకటి ఉంది కదా అనేది కొంత మంది ప్రశ్న. అయితే అది నభై ఏళ్లుగా ఉంది కానీ, డిస్ట్రిబ్యూటర్స్‌కు సంబంధించింది. అందులో డిస్ట్రిబ్యూటర్సే మెయిన్‌ మెంబర్స్‌గా ఉంటారు. మా దాంట్లో అలా కాదు నిర్మాతలే ముఖ్య పాత్ర వహిస్తారు.. అన్నారు.

‘టియఫ్‌సిసి’ వైస్‌ ఛైర్మన్‌, నిర్మాత గురురాజ్‌ మాట్లాడుతూ.. ఇటీవల నన్ను ప్రతాని రామకృష్ణ గారు ‘టియఫ్‌సిసి’కి వైస్‌ ఛైర్మన్‌ బాధ్యతలు అప్పగించారు. ఇక ‘టి మా’ను ఏర్పాటు చేయడం చాలా సంతోషం. ఎన్నికైన ప్రతి ఒక్కరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ.. వారి వారి బాధ్యతలను సక్రమంగా నిర్విరిస్తారని ఆశిస్తున్నా.. అన్నారు.

 ‘టి మా’ అధ్యక్షులు జెవిఆర్‌ మాట్లాడుతూ...‘‘మా పై నమ్మకంతో ‘టి మా’ కు అధ్యక్షులుగా  పదవిని అప్పగించిన ప్రతాని గారికి ధన్యవాదాలు  తెలుపుకుంటూ..‘టి మా’ అభివృద్ధికి కృషి చేస్తాను’’ అన్నారు.

సీనియర్‌ నటి, ‘టి మా’ ఉపాధ్యక్షురాలు గీతాంజలి మాట్లాడుతూ.. ‘‘నా యాభై ఐదేళ్ల సినిమా కెరీర్‌లో ఎన్నో కష్టనష్టాలు అనుభవించాను. అయినా ఏనాడు నిరుత్సాహ పడలేదు. నటులు ఎప్పుడూ నిరుత్సాహ పడకూడదు. ‘సీతారామ కళ్యాణం’తో నాకు ఎన్టీరామారావుగారు సీతగా సినీ పరిశ్రమలో మంచి గుర్తింపునిచ్చారు. అది నా అదృష్టం. ఇక ప్రస్తుత పరిస్థితుల్లో నటీనటులకు మంచి వేషాలు రావట్లేదనే చెప్పాలి. ఒకటి, రెండు రోజుల కాల్‌ షీట్స్‌ అడుగుతున్నారు. అవి అలా కనిపించి ఇలా వెళ్లిపోయే పాత్రలు. నేను కూడా సినిమాల్లో నాయనమ్మ పాత్రలు  చేస్తున్నాను. ఇక ప్రతాని రామకృష్ణగారు మా వారికి మంచి మిత్రులు, మంచి మనిషి. వారు అడగడంతో నేను ‘టి మా’కు ఉపాధ్యక్షులుగా వ్యవహరిస్తున్నా. ‘టి మా’ అసోసియేషన్‌ అభివృద్ధిలోకి రావాన్నది నా కోరిక. దానికి నా వంతు నేను కృషి చేస్తాను’’ అన్నారు.

Telanana MAA Team Announced :

Senior Actress Geethanjali about Telangana MAA
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
CJ Advs