చాలా తక్కువ కాలంలో తెలుగులో మంచి పాపులారిటీ దక్కించుకున్న కన్నడ బ్యూటీ రష్మిక ప్రస్తుతం మహేష్ బాబు లాంటి స్టార్ హీరో పక్కన చేసే అవకాశం కొట్టేసింది. ఈ సినిమాలో నటిస్తూనే మరో గోల్డెన్ ఆఫర్ కొట్టేసింది రష్మిక. అది కూడా హిందీలో కావడం విశేషం. తెలుగులో హిట్ అయిన జెర్సీని హిందీలో ప్రముఖ నిర్మాత కరణ్ జోహార్ రీమేక్ చేయనున్నారు. ఇందులో స్టార్ హీరో షాహిద్ కపూర్ హీరోగా నటిస్తున్నాడు. అతనికి జోడిగా రష్మిక ని తీసుకుంటే బాగుంటుందని అనుకుంటున్నారు కరణ్ జోహార్.
దాదాపు ఆమె కన్ఫర్మ్ అయిందని అంటున్నారు. రీసెంట్‌గా షాహిద్ కపూర్ నటించిన ‘కబీర్ సింగ్’ భారీ హిట్ అందుకోవడం జరిగింది. ఇప్పుడు అతను జెర్సీ రీమేక్ లో నటించబోతున్నాడు. మరి రష్మిక ఈ చిత్రంతో అక్కడ మరిన్ని ఆఫర్స్ దక్కించుకుంటుందేమో చూద్దాం.