నిన్నటివరకు సాహో సాహో అన్నోళ్లకి ఇప్పుడు బాగా అయ్యింది అంటున్నారు సోషల్ మీడియాలో. ప్రభాస్ బాహుబలి క్రేజ్ తో సాహో మీద భారీగా అంచనాలు రావడం.. అందుకు తగ్గ బడ్జెట్ సినిమాకి పెట్టడం జరిగింది. బడ్జెట్ కి మించి ప్రభాస్ క్రేజ్ తో సాహో కి బిజినెస్ జరిగింది. కానీ సినిమా విడుదలయ్యాక సీన్ వేరేగా ఉంది. మొదటి షోకే నెగటివ్ టాక్ తెచ్చుకున్న సాహో కి బిజినెస్ జరిగినదానికి సరిపడా కలెక్షన్స్ రావు బయ్యర్లు రోడ్డున పడతారనుకున్నారు. కానీ సాహో కలెక్షన్స్ పరంగా బావుంది. కానీ లాంగ్ వీకెండ్ లో కలెక్షన్స్ జోరు చూపించిన సాహో వీక్ డేస్ మొదలవగానే డల్ అయ్యింది. అంటే బయ్యర్లకు నష్టాలు తప్పవు.
అందుకే ఇప్పుడు సాహో ని చూసి.. కంగారు పడకూడదని సై రా ని కొనాల్సిన బయ్యర్లు డిసైడ్ అయ్యారనే టాక్ మొదలయ్యింది. సైరా కూడా భారీ బడ్జెట్ తో భారీగా ఐదు భాషల్లో విడుదల కాబోతున్న చిత్రం. అయితే సినిమా మీదున్న అంచనాలతో బయ్యర్లు ముందు సైరా ఏరియాల వారి హక్కుల కోసం పోటీ పడినా.. సాహో దెబ్బకి సైలెంట్ అయ్యారంటున్నారు. రామ్ చరణ్ మాత్రం సై రా కి పెట్టినదానికన్నా రెండింతలు లాభాలు రావాలని ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాడు. అందుకే ఏరియాల వారి డిస్ట్రిబ్యూటర్స్ తో చరణ్ మంతనాలు మొదలెట్టాడు. ఇక సాహో దెబ్బకి ఓవర్సీస్ డిస్ట్రిబ్యూటర్స్.. సైరా విషయంలో ఆలోచనలో పడినట్లుగా టాక్. ఇప్పటికే ఓవర్సీస్ డిస్ట్రిబ్యూటర్స్ తో రామ్ చరణ్ బేరాలు సాగిస్తున్నాడని, రామ్ చరణ్ చెప్పిన రేటుకు కాదు కానీ.. కనీసం సాహో రేటు కూడా సై రా కి వచ్చేలా కనబడటం లేదంటున్నారు. పాపం సాహో దెబ్బ సై రా మీద బాగా పడినట్లుగా కనబడుతుంది.