Advertisement
Google Ads BL

కియారా అద్వానీకి మరో అదిరిపోయే ఛాన్స్!


బాలీవుడ్ నటి కియారా అద్వానీ బాలీవుడ్‌లో చిన్న సినిమాలు చేస్తూ టాలీవుడ్‌లో ఏకంగా సూపర్ స్టార్ మహేష్ బాబు లాంటి స్టార్ హీరోతో భ‌ర‌త్ అనే నేను అనే సినిమా చేసి తొలి హిట్ అందుకుంది. దాని తరువాత వెంటనే రామ్ చ‌ర‌ణ్ లాంటి మ‌రో పెద్ద హీరో స‌ర‌స‌న విన‌య విధేయ రామ సినిమాలో ఛాన్స్ వ‌చ్చింది. ఈమూవీ డిజాస్టర్ అయినప్పటికీ కియారా కెరీర్‌కేమీ ఢోకా లేదు. 

Advertisement
CJ Advs

ఆమె హిందీలో కబీర్ సింగ్‌తో బ్లాక్ బస్టర్ అందుకుంది. ఇక హిందీలో రెండుమూడు సినిమాలతో బిజీగా ఉన్న ఈమె సౌత్‌లో మంచి మంచి ఆఫర్స్ కొట్టేస్తుంది. లేటెస్ట్‌గా ఈమె తమిళంలో ఓ పెద్ద మూవీ ఛాన్స్ కొట్టేసింది. స్టార్ హీరో విజయ్ స‌ర‌స‌న కియారా న‌టించ‌బోతోంద‌ట‌. ప్రస్తుతం విజయ్, అట్లీ డైరెక్షన్‌లో బిగిల్ అనే సినిమా చేస్తున్నాడు. ఈమూవీ తర్వాత మాన‌గ‌రం (తెలుగులో న‌గ‌రం) అనే చిన్న సినిమాతో ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం అయిన లోకేష్ క‌న‌గ‌రాజ్ డైరెక్ష‌న్లో ఓ సినిమా చేయడానికి ఒప్పుకున్నాడు విజయ్.

ఈసినిమాలో విజయ్ సరసన కియారా నటించబోతుందని చెబుతున్నారు. విజయ్ లాంటి మాస్ ఇమేజ్ ఉన్న హీరో‌తో కోలీవుడ్లోకి ఎంట్రీ ఇవ్వ‌డ‌మంటే చిన్న విష‌యం కాదు. ఒకవేళ ఈమూవీ హిట్ అయితే కియారాకు అక్కడ తిరుగుండదు.

Kiara Adwani Gets On more Big Chance in South:

Kiara Adwani in Tamil Star Hero Vijay Film
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
CJ Advs