Advertisement
Google Ads BL

బీట్ చేయాలంటే.. రాజమౌళి రావాల్సిందేనా?


బాహుబలిని తలదన్నే సినిమాని కేవలం బాహుబలి దర్శకుడు రాజమౌళి వల్లే అవుతుందా? ఎందుకంటే బాహుబలిని బీట్ చేయాలని కలలు కన్నా చాలామంది చివరికి సౌండ్ లేకుండా సైలెంట్ అవ్వాల్సిన పరిస్థితి. బాహుబలి ని టార్గెట్ చేసిన రోబో 2.ఓ కి చుక్కలు కనబడ్డాయి. ఇక బాహుబలిని కొట్టాలనే కసితో సల్మాన్ తీసిన సినిమాలన్నీ బాక్సాఫీసు వద్ద తుస్ మన్నాయి. మరి తాజాగా ప్రభాస్ సాహో కూడా కలెక్షన్స్ పరంగా దూసుకుపోతున్నా... టాక్ పరంగా చాలా వీక్‌గా వుంది.

Advertisement
CJ Advs

మరి బాహుబలి రేంజ్ మూవీని మళ్లీ మనం రాజమౌళి డైరెక్షన్ లో తెరకెక్కుతున్న RRR తోనే చూడగలమా అనే అనుమానమైతే అందరిలో ఉంది. మరి అక్టోబర్ 2న విడుదల కాబోతున్న సై రా నరసింహారెడ్డి మీద కూడా ఇప్పుడు సాహో చూసాక... నమ్మకం పోయినట్లే కనబడుతుంది. ఎందుకంటే సురేందర్ రెడ్డి ఇప్పటివరకు టాలీవుడ్ హీరోలతో చిన్న కథలతో మిడియం బడ్జెట్ సినిమాలు చేసిన దర్శకుడు. మరి ఒక్కసారిగా నేషనల్ వైడ్‌గా ఐదు భాషల్లో సినిమాని హ్యాండిల్ చెయ్యాలంటే కూసింత కష్టమే. అందుకే సై రా మీద హోప్స్ పెట్టుకున్నోళ్ళు.. సాహో చూసాక టెంక్షన్ పడుతున్నారు. మరి బాహుబలి లాంటి భారీ బ్లాక్ బస్టర్ ని రాజమౌళి తన RRR తోనే కొడతాడని ప్రచారం ఊపందుకుంది. ఎన్టీఆర్, రామ్ చరణ్ లతో ఖచ్చితంగా రాజమౌళి బ్లాక్ బస్టర్ కొట్టడమే కాదు.. బాహుబలి రికార్డులని తన RRR తో ఖచ్చితంగా బద్దలు కొడతాడని అంటున్నారు.

Baahubali Records safe:

Only Rajamouli can beat Baahubali
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs