Advertisement
Google Ads BL

‘సాహో’ ప్రభంజనం: 2 రోజుల్లో 205 కోట్లు


రెండు రోజుల్లో 205 కోట్లు....వ‌రల్డ్ వైడ్‌గా దుమ్మురేపిన సాహో

Advertisement
CJ Advs

‘బాహుబలి’తో జాతీయనటుడిగా గుర్తింపు పొందిన ప్రభాస్‌కు.. ‘సాహో’ చిత్రంతో ఫ్యాన్స్‌తోపాటు ప్రేక్షకులు ఆయన్ను ఫిదా చేసేశారు. శుక్రవారం నాడు నాలుగుభాషల్లో విడుదలైన సాహో చిత్రానికి మొదటగా డివైడ్‌టాక్‌ వచ్చినా... చిత్రంలోని ప్రభాస్‌ యాక్షన్‌ సీన్స్‌కు ఖుషీ అయిపోయారు. బాలీవుడ్‌లో సల్మాన్‌, తదితరుల హీరోల కలెక్షన్లు వంద కోట్ల క్లబ్‌లో రావడం మనం చూసిందే. కానీ తెలుగులో ప్రభాస్‌కు దక్కడం మరింత విశేషం. దాంతో ప్రభాస్‌ను ఒక్కసారిగా ఒక్కరోజులోనే వందకోట్ల క్లబ్‌లో సాహో చేర్చింది. రెండు రోజుల్లోనే 205కోట్లు రావ‌డం విశేషం. ప్ర‌భాస్ కెరియ‌ర్‌లో బాహుబ‌లి త‌ర్వాత అతి పెద్ద క‌లెక్ష‌న్లు సాధించిన చిత్రం సాహో.

ఇండియాలో బిగ్గెస్ట్‌ యాక్షన్‌ థ్రిల్లర్‌గా వచ్చిన సాహోకు ‘డార్లింగ్‌’ ప్రభాస్‌ ఫ్యాన్స్‌తో పాటు సినిమాను అభిమానించే ప్రతి ఒక్కరూ ‘సాహో’ అంటూ నీరాజనాలు పలుకుతున్నారు. బాక్సాఫీస్‌ కలెక్షన్స్‌ విషయంలో ఇంత వరకు ఎక్కడా డ్రాప్‌ కాకుండా హౌస్‌ ఫుల్‌ వసూలుతో దూసుకుపోతుంది. ఓవర్సీస్‌ లో కూడా సాహో ప్రభంజనం కొనసాగుతుంది, తొలి రోజులోనే మిలియన్‌ క్లబ్‌ లో చేరి మరోసారి ప్రభాస్‌ స్టామినా ఏ రేంజ్‌ లో ఉందో నిరూపించింది సాహో. ప్రభాస్‌ పేరిట ఉన్న తొలి రోజు కలెక్షన్స్‌ రికార్డ్స్‌‌ని కూడా సాహో బ్రేక్‌ చేసింది,  చాలా ఏరియాలలో ఉన్న బాహుబలి తొలి రోజు కలెక్షన్స్‌ రికార్డ్స్‌ ని సాహో తో చాలా ఈజీ గా దాటేశాడు డార్లింగ్‌ ప్రభాస్‌.  

అబ్బురపరుస్తున హై వోల్టాజ్‌ యాక్షన్‌ సీన్స్‌ 

సాహో కోసం డైరెక్టర్‌ సుజీత్‌ రెడీ చేసిన యాక్షన్‌ సీన్స్‌‌కి థియేటర్స్‌‌లో ఆడియన్స్‌ నుంచి అద్భుతమైన రెస్పాన్స్‌ లభిస్తుంది. ఇండియన్‌ సినిమా స్క్రీన్‌‌పై ఇంత వరకు కనిపించని హై వోల్టేజ్‌ యాక్షన్‌ సన్నివేశాలు చూసేందుకు టాక్‌ తో సంబంధం లేకుండా సాహో థియేటర్స్‌‌కి ఫ్యాన్స్‌ క్యూలు కడుతున్నారు, దీంతో ట్రేడ్‌ విషయంలో కూడా సాహో సరికొత్త రికార్డ్స్‌ సెట్‌ చేయడం దాదాపు ఖాయంగానే కనిపిస్తుంది. 

నార్త్‌ లో డార్లింగ్‌ డై హార్డ్‌ ఫాన్స్‌ హంగామా 

పాన్‌ ఇండియా వైడ్‌ సినిమాగా రిలీజైన సాహో‌కి రిలీజైన ప్రతి చోట హౌస్‌ ఫుల్‌ కలెక్షన్స్‌ దక్కుతున్నాయి, మరి ముఖ్యంగా ఈ సినిమాను బాలీవుడ్‌ ఆడియన్స్‌ బాగా ఎంజాయ్‌ చేస్తున్నారు. ఇప్పటికే బుక్‌ మై షో పే టీమ్‌ వంటి టిక్కెటింగ్‌ వెబ్‌ సైట్స్‌‌లో ఈ సినిమాకు సంబందించిన టికెట్స్‌ అడ్వాన్స్‌ బుకింగ్స్‌ జరిగినట్లుగా తెలుస్తుంది. ఈ బుకింగ్‌ రేషియో నార్త్‌ లో మరి ఎక్కువగా ఉన్నట్లుగా ట్రేడ్‌ వర్గాలు చెబుతున్నాయి.

Saaho Sensation: 205 Crores in 2 Days:

Saaho Collections Creates Sensation at Box Office
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
CJ Advs