వినాయక చవితి సందర్భంగా ఉత్కంఠ మూవీ ట్రైలర్‌ను విడుదల చేసిన ప్రముఖ దర్శకుడు బాబీ
అఖిల్ అండ్ నిఖిల్ ప్రొడక్షన్స్ బ్యానర్‌లో తెరకెక్కుతున్న ‘ఉత్కంఠ’ మూవీ ట్రైలర్‌ను ‘పవర్, జై లవకుశ. వెంకీ మామ’ వంటి సూపర్ హిట్ చిత్రాల దర్శకుడు బాబీ విడుదల చేశారు. ప్రవీణ్, మనోజ్ నిర్మాతలుగా వ్యవహరిస్తున్న ఈ సినిమాకు చంద్ర శేఖర్ ఆజాద్ దర్శకత్వం వహించగా.. వెల్లూరు మధుబాబు సహా నిర్మాతగా, మధు వి.ఆర్ లైన్ ప్రొడ్యూసర్‌గా ఈ చిత్రాన్ని నిర్మించారు.
ట్రైలర్ విడుదల సందర్భంగా దర్శకుడు బాబీ మాట్లాడుతూ... నిర్మాతగా నాకు తెలిసిన చంద్రశేఖర్ ఆజాద్ మొదటిసారి దర్శకత్వం వహించిన ఉత్కంఠ సినిమా ట్రైలర్ బాగుంది. ట్రైలర్ చూడగానే ఈ సినిమాను చూడాలని అనిపించింది. నిర్మాతలు ప్రవీణ్ , మనోజ్.B.Tec గార్లకు ఈ సినిమా మంచి పేరు తెచ్చిపెట్టాలన్నారు.
చంద్రశేఖర్ ఆజాద్ పాతిబండ్ల మాట్లాడుతూ... వెంకీమామ సినిమా బిజీ షెడ్యూల్ లో ఉన్నా కూడా మా ట్రైలర్ విడుదల చేసిన దర్శకుడు బాబి గారికి థాంక్స్. ఉత్కంఠ చిత్రంలో నటించిన నటీనటులు, సాంకేతిక నిపుణులందరికి ధన్యవాదాలు. నిర్మాతలు ప్రవీణ్, మనోజ్ ఈ సినిమాను ఎక్కడా రాజీపడకుండా నిర్మించారు. అలాగే నిర్మాత మోహన్ వడ్లపట్ల గారు ఈ సినిమా చిత్రీకరణ సమయంలో బాగా సపోర్ట్ చేశారు, వారికి ధన్యవాదాలు. ఈ సినిమా అందరికి నచ్చుతుందని ఆశిస్తున్నానన్నారు.
నిర్మాతల మండలి ప్రధాన కార్యదర్శి మోహన్ వడ్లపట్ల మాట్లాడుతూ... ఉత్కంఠ చిత్ర ట్రైలర్ చూసాను, సినిమా కోసం వెయిట్ చేస్తున్నాను. దర్శకుడు చంద్రశేఖర్ ఆజాద్ కష్టపడి ఈ సినిమా చేసాడు. మంచి కంటెంట్ ఉన్న చిన్న సినిమాలు ఎప్పుడూ ప్రేక్షకాదరణ పొందుతుంది. ఈ సినిమా పెద్ద విజయం సాధించాలని కోరుకుంటున్న అన్నారు.