Advertisement
Google Ads BL

బాల‌య్య 105వ చిత్రం రెండో షెడ్యూల్ డిటైల్స్!


హైద‌రాబాద్‌లో సెప్టెంబ‌ర్ 5 నుండి నంద‌మూరి బాల‌కృష్ణ 105వ చిత్రం సెకండ్ షెడ్యూల్ 

Advertisement
CJ Advs

నటసింహ నందమూరి బాలకృష్ణ హీరోగా నటిస్తోన్న 105వ చిత్రం రెగ్యులర్‌ షూటింగ్‌ శరవేగంగా జరుగుతుంది. హ్యాపీ మూవీస్‌ బ్యానర్‌పై కె.ఎస్‌.రవికుమార్‌ దర్శకత్వంలో సి.కల్యాణ్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ‘జైసింహా’ వంటి విజ‌య‌వంత‌మైన చిత్రం త‌ర్వాత ఈ హిట్ కాంబినేష‌న్‌లో రూపొందుతోన్న రెండో చిత్ర‌మిది. ఇటీవ‌ల థాయ్‌లాండ్‌లో తొలి షెడ్యూల్ పూర్త‌య్యింది. సెప్టెంబ‌ర్ 5 నుండి హైద‌రాబాద్ రామోజీ ఫిలింసిటీలో లెంగ్తీ షెడ్యూల్ ప్రారంభ‌మ‌వుతుంది. బాల‌కృష్ణ రెండు డిఫ‌రెంట్ లుక్స్‌లో క‌న‌ప‌డతారు. ఇటీవ‌ల విడుద‌లైన ఓ లుక్‌కి ప్రేక్ష‌కుల నుండి చాలా మంచి స్పంద‌న వ‌చ్చింది. 

వినాయ‌క చ‌వితి సంద‌ర్భంగా ప్రేక్ష‌కుల‌కు శుభాకాంక్ష‌ల‌ను తెలియ‌జేస్తూ రెండు పోస్ట‌ర్స్‌ను యూనిట్ విడుద‌ల చేసింది. సోనాల్‌ చౌహాన్‌, వేదిక హీరోయిన్స్‌గా నటిస్తున్నారు. ప్రకాశ్‌రాజ్‌, జయసుధ, భూమిక చావ్లా ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. చిరంత‌న్ భ‌ట్‌ సంగీతం అందిస్తోన్న ఈ చిత్రానికి సి.రామ్‌ప్రసాద్‌ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. 

 

నటీనటులు: 

నందమూరి బాలకృష్ణ

సోనాల్ చౌహాన్

వేదిక

ప్రకాశ్ రాజ్

భూమిక చావ్లా

జయసుధ

షాయాజీ షిండే

నాగినీడు

సప్తగిరి

శ్రీనివాస్‌రెడ్డి

రఘుబాబు 

ధన్‌రాజ్ తదితరులు

 

సాంకేతిక నిపుణులు:

దర్శకత్వం: కె.ఎస్.రవికుమార్

నిర్మాత: సి.కల్యాణ్

కో ప్రొడ్యూసర్స్:  సి.వి.రావ్, పత్సా నాగరాజు

కథ: పరుచూరి మురళి

మ్యూజిక్: చిరంతన్ భట్

సినిమాటోగ్రఫీ: సి.రాంప్రసాద్

ఆర్ట్: చిన్నా

పాటలు: రామజోగయ్యశాస్త్రి, భాస్కరభట్ల

ఫైట్స్: రామ్ లక్ష్మణ్, అన్బు, అర‌వి

కొరియోగ్రఫీ: జానీ మాస్టర్

NBK105 Second Schedule From September 5th at Ramoji Film City:

NBK105 Second Schedule Details
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs