Advertisement
Google Ads BL

‘తారామణి’ ప్రీ రిలీజ్ ఫంక్షన్ విశేషాలివే!


అంజ‌లి, ఆండ్రియా, వ‌సంత్ ర‌వి ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టించిన చిత్రం ‘తారామ‌ణి’. రామ్ ద‌ర్శ‌కుడు. ఈ చిత్రాన్ని జె.ఎస్.కె ఫిలిం కార్పొరేషన్ సమర్పణలొ డి.వి.సినీ క్రియేష‌న్స్ మరియు లక్ష్మీ వెంకటేశ్వర ఫ్రేమ్స్ బ్యాన‌ర్‌పై డి.వి.వెంక‌టేష్, ఉదయ్ హర్ష వడ్డేల్ల సంయుక్తంగా తెలుగు ప్రేక్ష‌కులకు అందిస్తున్నారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం సెప్టెంబరు 6న విడుదలకు సిద్దమవుతోంది. ఈ సంద‌ర్భంగా.. శనివారం హైదరాబాద్ లో ప్రీ రిలీజ్ ఫంక్షన్ జరిగింది. ఈ కార్యక్రమంలో హీరోయిన్ ఆండ్రియా, ప్రముఖ నిర్మాత కె .యల్ .  దామోదర ప్రసాద్, చిత్ర నిర్మాతలు ఉదయ్ హర్ష వడ్డేల్ల, డి.వి.వెంక‌టేష్, పద్మిని, డి ఎస్ రావు, ప్రతాని రామకృష్ణ గౌడ్, ప్రసన్న కుమార్ తదితరులు పాల్గొన్నారు. 

Advertisement
CJ Advs

ప్రముఖ నిర్మాత కె .యల్. దామోదర ప్రసాద్ మాట్లాడుతూ.. ‘‘వెంకటేష్, ఉదయ్ ఎంతో అభిరుచి ఉన్న నిర్మాతలు. ట్రైలర్ చూసాక.. ఇదొక రియలిస్టిక్ ఫిలిం అని అర్ధమవుతుంది. మనం బయటకు చెప్పుకోలేని ఎన్నో ఎమోషన్స్ ప్రజంట్ సినిమాలు చెబుతున్నాయి. అలాంటి సినిమాల్లో ఇదొకటి. ఆండ్రియా మంచి నటి. ఇక మంచి రిలీజ్ డేట్ చూసుకొని    సెప్టెంబర్ 6 రిలీజ్ చేస్తున్నారు. ఈ సినిమా సక్సెస్ సాధించాలనీ, వెంకటేష్ స్ట్రెయిట్ సినిమాలు కూడా నిర్మించాలనీ కోరుకుంటున్నాను..’’ అన్నారు. 

నిర్మాత డి.వి.వెంక‌టేష్ మాట్లాడుతూ.. ‘‘తమిళ్ లో పెద్ద హిట్టైన సినిమా ఇది. కంటెంట్ నచ్చి రీమేక్ చేద్దాం అనుకున్నాం, కానీ కుదర్లేదు. ఇక తెలుగు నేటివిటీకి తగ్గట్టుగా ఎక్కడ రాజీ పడకుండా అనువాద కార్యక్రమాలు చేశాం. ఇంత మంచి సినిమాను గ్రాండ్ రిలీజ్ చేయాలని.. మంచి డేట్ కోసం వెయిట్ చేయడం వల్ల కొంత డిలే అయ్యింది. సెప్టెంబర్ 6న వస్తున్నాం. ఆండ్రియా గారు చాలా సపోర్ట్ చేస్తున్నారు. తెలుగు వారికి నచ్చే సినిమా అవుతుంది’’ అన్నారు. 

మరో నిర్మాత ఉదయ్ హర్ష వడ్డేల్ల మాట్లాడుతూ.. ఇదొక  ట్ర‌యాంగిల్ ల‌వ్‌స్టోరీ. సినిమాలో ఎమోష‌న‌ల్ కంటెంట్‌తో పాటు అన్ని ఎలిమెంట్స్ స‌మ‌పాళ్లలో ఉంటాయి. ప్ర‌తి స‌న్నివేశం మ‌న‌సును హ‌త్తుకునేలా ఉంటుంది. ప్ర‌స్తుతం స‌మాజంలో స్త్రీలు ఎదుర్కొంటున్న స‌మ‌స్య‌ల నేపథ్యంలో సినిమా సాగుతుంది. ప్ర‌స్తుతం యువ‌త టెక్నాల‌జీ మాయ‌లో ప‌డి ఎలా ప్ర‌వ‌ర్తిస్తున్నారు. ఎలాంటి ప్ర‌లోభాల‌కు లోన‌వుతున్నారు. ఫలితంగా వారెలాంటి ప‌రిస్థితులను ఎదుర్కొంటున్నార‌నే అంశాలు కూడా సినిమాలో ఉంటాయి. య‌ువ‌త‌ను మెప్పించే అంశాల‌న్నీ ఈ సినిమాలో ఉంటాయి. సెప్టెంబరు 6న సినిమాను ప్రేక్షకుల ముందుకు వస్తున్నామన్నారు. 

హీరోయిన్ ఆండ్రియా మాట్లాడుతూ.. ‘‘ఈ సినిమా తమిళంలో చిన్న సినిమాగా విడుదలై పెద్ద సక్సెస్ అయ్యింది. నా మనసుకు చాలా నచ్చిన సినిమా ఇది. తెలుగు ట్రైలర్ చూసాక చాలా ఎక్సయిట్ అయ్యాను. తెలుగులో ‘తారామణి’ రిలీజ్ కావడం చాలా హ్యాపీ. నిర్మాతలు వెంకటేష్, ఉదయ్ గార్లకు థాంక్స్’’ అన్నారు. 

ప్రతాని రామకృష్ణ గౌడ్ మాట్లాడుతూ.. ‘‘నిర్మాత వెంకటేష్ నాకు మంచి మిత్రుడు. ప్రెజెంట్ ప్రేక్షకులు ఎలాంటి సినిమాలు ఇష్టపడుతున్నారో.. అలాంటి సినిమాను తీసుకొని తెలుగులో రిలీజ్ చేస్తున్నారు. తమిళ్ కన్నా ఈ సినిమా తెలుగులో పెద్ద సక్సెస్ సాధించాలని కోరుకుంటున్నా’’ అన్నారు. 

డి.ఎస్. రావు మాట్లాడుతూ.. ‘‘ఆండ్రియా గారు ఈ సినిమా ప్రమోషన్స్  కోసం ప్రత్యేకంగా రావడం అభినందనీయం’’ అన్నారు. 

పద్మిని మాట్లాడుతూ.. ట్రైలర్ చాలా రియలిస్టిక్‌గా ఉంది. యువన్ శంకర్ రాజాగారి మ్యూజిక్ సినిమాకు ఆకర్షణ. సినిమా మంచి సక్సెస్ సాధించాలని అన్నారు. 

ప్రసన్న కుమార్ మాట్లాడుతూ.. తమిళ్ కన్నా తెలుగులో సినిమా పెద్ద విజయం సాధిస్తుంది.. అన్నారు.

Taramani Movie Pre Release Event Highlights:

Celebrities Speech at Taramani Pre Release Event
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs