Advertisement
Google Ads BL

నాగబాబు చేతుల మీదుగా ‘జైసేన’ ఫస్ట్ సాంగ్


సముద్ర డైరెక్షన్‌లో రూపొందుతున్న ‘జైసేన’ మంచి విజయం సాధిస్తుంది- మెగా బ్రదర్‌ నాగబాబు 

Advertisement
CJ Advs

శ్రీకాంత్‌, సునీల్‌ ప్రధాన పాత్రల్లో శ్రీకార్తికేయ, అభిరామ్‌, ప్రవీణ్‌, హరీష్‌గౌతమ్‌లను పరిచయం చేస్తూ వి.విజయలక్ష్మి సమర్పణలో శివ మహాతేజ ఫిలిమ్స్‌ పతాకంపై వి.సముద్ర దర్శకత్వంలో వి.సాయిఅరుణ్‌ కుమార్‌ నిర్మిస్తున్న చిత్రం ‘జై సేన’. ఈ చిత్రం షూటింగ్‌ పూర్తి చేసుకొని ప్రస్తుతం పోస్ట్‌ ప్రొడక్షన్‌ వర్క్‌ జరుపుకుంటోంది. త్వరలోనే సినిమాను విడుదల చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ సినిమాకి సంబంధించి ఇటీవల విడుదలైన సునీల్‌ టీజర్‌కి చాలా మంచి రెస్పాన్స్‌ వచ్చింది. 

‘మా స్టూడెంట్స్‌ పవరేంటో తెలిపేదే సేన’ 

ఈ సినిమాలోని ఫస్ట్‌ సాంగ్‌, టైటిల్‌ సాంగ్‌ను మెగాబ్రదర్‌ నాగబాబు విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో దర్శకుడు వి.సముద్ర, కో ప్రొడ్యూసర్‌: శిరీష్‌రెడ్డి, హీరోలు శ్రీకార్తికేయ, అభిరామ్‌, ప్రవీణ్‌ పాల్గొన్నారు. 

‘హలో మిత్రమా......సేన జై సేన సేన.. మా స్టూడెంట్స్‌ పవరేంటో తెలిపేదే సేన.. యుద్ధం చెయ్‌, యుద్ధం చెయ్‌, యుద్ధం చెయ్‌రా..’ అంటూ సాగే ఈ పాటలో ఇండియన్‌ క్రికెట్‌ టీమ్‌ డ్రెస్‌తో, ఆర్మీ యూనిఫాంలో ఉన్న యంగ్‌స్టర్స్‌ కనిపిస్తారు. అలాగే మన జాతీయ జెండాను కూడా ప్రొజెక్ట్‌ చేయడంతో ఈ పాట ఎంతో ఇన్‌స్పైరింగ్‌గా అనిపిస్తోంది. 

‘జైసేన’ సాంగ్‌ను విడుదల చేసిన అనంతరం మెగాబ్రదర్‌ నాగబాబు మాట్లాడుతూ.. ‘‘శివ మహాతేజ బేనర్‌లో డైరెక్టర్‌ సముద్రగారు నిర్మిస్తున్న ఈ సినిమాకి ‘జైసేన’ అనే టైటిల్‌ పెట్టారు. యంగ్‌స్టర్స్‌ ఈ సినిమాలో మంచి పాత్రలు పోషించారు. శ్రీకాంత్‌, సునీల్‌ ప్రముఖ క్యారెక్టర్స్‌ చేశారు. సాంగ్‌ చూసినపుడు యూత్‌ అండ్‌ పొలిటికల్‌ మూవీ అనిపించింది. ఈ సినిమాకి పనిచేసిన వారందరికీ, ఈ సినిమాకి దర్శకత్వం వహించి నిర్మిస్తున్న సముద్రగారికి ఆల్‌ ది బెస్ట్‌ చెప్తున్నాను. ఈ సినిమా మంచి విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను’’ అన్నారు. 

దర్శకుడు వి.సముద్ర మాట్లాడుతూ.. ‘‘శివ మహాతేజ ఫిలింస్‌ బేనర్‌లో నిర్మించిన ‘జైసేన’ ఫస్ట్‌ సాంగ్‌, టైటిల్‌ సాంగ్‌ మా అన్నయ్య నాగబాబుగారి చేతులమీదుగా రిలీజ్‌ చేశాం. మేం అంతా బాగుండాలని నేను అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా ఉన్నప్పటి నుంచి చిరంజీవిగారు, నాగబాబుగారి బ్లెసింగ్స్‌ ఉన్నాయి. నా సినిమా ఫస్ట్‌ సాంగ్‌ అన్నయ్య చేతుల మీదుగా రిలీజ్‌ చేయడం చాలా సంతోషంగా ఉంది. ఎంతో హార్ట్‌ఫుల్‌గా అన్నయ్య బ్లెసింగ్స్‌ ఇచ్చారు. తప్పకుండా ఈ సినిమా పెద్ద సక్సెస్‌ అవుతుంది. మరో సంతోషకరమైన విషయం ఏమిటంటే సెప్టెంబర్‌ 2 పవర్‌స్టార్‌ పవన్‌కల్యాణ్‌గారి పుట్టినరోజు. ఈ విధంగా మాకు కలిసొస్తున్నందుకు హ్యాపీగా ఉంది. అందరికీ హ్యాపీ వినాయకచవితి. పవర్‌స్టార్‌ పవన్‌కల్యాణ్‌గారికి మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్‌ ఆఫ్‌ ది డే. శ్రీకాంత్‌, సునీల్‌, తారక్‌, కార్తికేయ, హరీష్‌, ప్రవీణ్‌, మా తోటి ఫ్రెండ్స్‌ శిరీష్‌, శ్రీను మేమంతా కలిసి చేసిన ఈ ప్రయత్నం మంచి విజయాన్ని అందిస్తుందని ఆశిస్తున్నాను’’ అన్నారు. 

కో-ప్రొడ్యూసర్‌ పి.సురేష్‌రెడ్డి మాట్లాడుతూ.. ‘‘మా సినిమాలోని మొదటి పాటను విడుదల చేసిన నాగబాబుగారికి చాలా థాంక్స్‌. సినిమా చాలా బాగా వచ్చింది. షూటింగ్‌ పూర్తి చేశాం. ప్రస్తుతం పోస్ట్‌ ప్రొడక్షన్‌ వర్క్‌ జరుగుతోంది. త్వరలోనే మా ‘జైసేన’ను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నాం’’ అన్నారు. 

హీరోలు శ్రీకార్తికేయ, అభిరామ్‌, ప్రవీణ్‌ మాట్లాడుతూ.. ‘‘మా జైసేన చిత్రంలోని మొదటి పాట నాగబాబుగారి చేతులమీదుగా విడుదల కావడం ఎంతో ఆనందంగా ఉంది. ఇంత మంచి సినిమాలో అవకాశం ఇచ్చిన సముద్రగారికి థాంక్స్‌, తప్పకుండా మా సినిమాను ఆదరించి సూపర్‌హిట్‌ చెయ్యాలని కోరుకుంటున్నాం’’ అన్నారు. 

శ్రీకాంత్‌, సునీల్‌ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రం ద్వారా శ్రీకార్తికేయ, అభిరామ్‌, ప్రవీణ్‌, హరీష్‌గౌతమ్‌ పరిచయం అవుతున్నారు. అజయ్‌ ఘోష్‌, మధు, ఆజాద్‌, ధనరాజ్‌, వేణు, చమ్మక్‌ చంద్ర తదితరులు ఇతర పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి మాటలు: తిరుమల శెట్టి సుమన్‌, పార్వతిచందు, పాటలు: అభినయ్‌ శ్రీను, సిరాశ్రీ, సంగీతం: రవిశంకర్‌, డ్యాన్స్‌: అమ్మారాజశేఖర్‌, అజయ్‌, ఫైట్స్‌: కనల్‌ కన్నన్‌, నందు, రవివర్మ, కెమెరా: వాసు, కో ప్రొడ్యూసర్స్‌: పి.శిరీష్‌ రెడ్డి, దేవినేని శ్రీనివాస్‌, నిర్మాత: వి.సాయి అరుణ్‌ కుమార్‌, కథ, స్క్రీన్‌ప్లే,దర్శకత్వం: వి.సముద్ర.

Nagababu Launches Jai Sena Movie First Song:

Jai Sena Movie First Song Released
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs