Advertisement
Google Ads BL

‘అల వైకుంఠపురములో’.. తొలి ప్రచార చిత్రం!


స్టైలిష్ స్టార్ అల్లుఅర్జున్, త్రివిక్రమ్ శ్రీనివాస్, హారిక హాసిని క్రియేషన్స్, గీత ఆర్ట్స్ ల చిత్రం ‘అల వైకుంఠపురములో’...తొలి ప్రచార చిత్రం విడుదల 

Advertisement
CJ Advs

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, మాటల మాంత్రికుడు, సుప్రసిద్ధ సినీ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్‌ల కాంబినేషన్‌లో పలు విజయవంతమైన చిత్రాల్ని అందించిన భారీ నిర్మాణ సంస్థలు ‘హారిక అండ్ హాసిని క్రియేషన్స్’, ‘గీతాఆర్ట్స్’ కాంబినేషన్‌లో వస్తున్న చిత్రం ‘అల వైకుంఠపురములో...’. ఈరోజు ఉదయం చిత్రం తొలి ప్రచార చిత్రాన్ని స్టైలిష్ స్టార్ ‘అల్లు అర్జున్’ తన అధికారిక సామాజిక మాధ్యమం అయిన ట్విట్టర్ ఖాతా ద్వారా విడుదలచేశారు. హీరోగా అల్లు అర్జున్‌కు ఇది 19వ చిత్రం కాగా.. అల్లు అర్జున్, త్రివిక్రమ్ ల  కాంబినేషన్‌లో మూడో చిత్రం. ‘జులాయి, సన్నాఫ్ సత్యమూర్తి’ చిత్ర విజయాల నేపథ్యంలో ముచ్చటగా మూడోసారి తెరకెక్కనున్న ఈ చిత్రంపై ఇటు సినీ వాణిజ్య రంగాల్లో, అటు ప్రేక్షక వర్గాల్లోనూ అంచనాలు ఉన్నత స్థాయిలో ఉన్నాయి. వీటిని నిజం చేసే దిశగా సుప్రసిద్ధ చలన చిత్ర నిర్మాణ సంస్థలు హారిక అండ్ హాసిని క్రియేషన్స్, ‘గీతాఆర్ట్స్’ అధినేతలు అల్లు అరవింద్, ఎస్. రాధాకృష్ణ (చినబాబు) లు సంయుక్తంగా ఈ చిత్రాన్ని ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్నారు.  

‘అల... వైకుంఠపురములో’ ఫుల్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్. ఇటీవలే చిత్రం పేరును వీడియో ద్వారా ప్రకటించటం జరిగింది. అందులో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ చెప్పిన డైలాగ్ కు అద్భుతమైన స్పందన లభించింది. ఈరోజు విడుదల అయిన తొలి ప్రచార చిత్రంలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కనిపిస్తున్న తీరు ప్రేక్షకాభిమానులను కనువిందు చేయటంతో పాటు, చిత్రంపై అంచనాలు మరింత పెరిగేలా చేసింది. ప్రస్తుతం హైదారాబాద్‌లో షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా చిత్రం విడుదల కానుంది. 

తారాగణం:

సౌత్ ఇండియన్ క్రేజీ స్టార్ అల్లు అర్జున్, పూజా హెగ్డే, టబు, రాజేంద్రప్రసాద్, సచిన్ ఖేడ్ కర్, మురళీ శర్మ, సముద్ర ఖని, జయరాం, సునీల్, నవదీప్, సుశాంత్, నివేతా పేతురాజ్, గోవిందా పద్మసూర్య, బ్రహ్మాజీ, హర్షవర్ధన్, అజయ్, రాహుల్ రామకృష్ణ తదితరులు నటిస్తున్నారు.

సాంకేతిక వర్గం:

డి.ఓ.పి: పి.ఎస్.వినోద్, సంగీతం: థమన్.ఎస్,ఎస్, ఎడిటర్: నవీన్ నూలి: ఆర్ట్: ఏ.ఎస్.ప్రకాష్, ఫైట్స్: రామ్ - లక్ష్మణ్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: పి.డి.వి.ప్రసాద్, నిర్మాతలు: అల్లు అరవింద్, ఎస్.రాధాకృష్ణ (చినబాబు)

The ultra stylish Ala Vaikunthapurramuloo Poster is here:

Ala Vaikunthapurramuloo first Look Poster released
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs