Advertisement
Google Ads BL

‘వీడే సరైనోడు’ విడుదల ఎప్పుడంటే..?


జీవా, నయనతార నటించిన వీడే సరైనోడు సెప్టెంబర్ 6న విడుదల

Advertisement
CJ Advs

జీవా, నయనతార జంటగా తమిళంలో రూపొంది విజయం సాధించిన చిత్రాన్ని తెలుగులో ‘వీడే సరైనోడు’ పేరుతో అనువదిస్తున్నారు. నోవా సినిమాస్‌ పతాకంపై కోకా శిరీష సమర్పణలో జక్కుల నాగేశ్వరావు అందిస్తున్నారు. ఈ చిత్ర ప్రెస్ మీట్ లో నిర్మాత ప్రసన్న కుమార్, నిర్మాత దామోదర్ ప్రసాద్, మోహన్ వడ్లపట్ల తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా నిర్మాత దామోదర్ ప్రసాద్ మాట్లాడుతూ... చిన్న సినిమాలు ఏడాదికి 150 వరుకు వస్తుంటాయి. అందులో 30 వరకు డబ్బింగ్ సినిమాలు విడుదలవుతుంటాయి. ఈ డబ్బింగ్ సినిమాలు పెద్ద సినిమాలకు పిల్లర్స్ లాగా  ఉంటాయి. ఈ సినిమా విజయం సాధించి నిర్మాత నాగేశ్వరరావు గారికి మంచి డబ్బు, పేరు సంపాదించి పెట్టాలని కోరుకుంటున్నాను.. అన్నారు.

నిర్మాత ప్రసన్న కుమార్ మాట్లాడుతూ.. ఈ సినిమాలో మంచి కమర్షియల్ ఎలిమెంట్స్ తో పాటు మంచి నటులు ఉన్నారు. సినిమా పెద్ద సక్సెస్ కావాలని కోరుకుంటున్నాను.. అన్నారు.

మోహన్ వడ్లపట్ల మాట్లాడుతూ... సినిమా విడుదలకు మంచి డేట్ కుదిరింది. నయనతార, జీవ నటన సినిమాకు అదనపు ఆకర్షణ కానుంది. నిర్మాత నాగేశ్వరరావు గారికి ఈ సినిమా మంచి పేరు తెచ్చిపెడుతుందని నమ్ముతున్నాను అన్నారు.

నిర్మాత నాగేశ్వరరావు మాట్లాడుతూ... ఈ సినిమా కోసం నాకు సహాయ పడిన వారందరికీ ధన్యవాదాలు. ప్రసన్న కుమార్, దామోదర్ ప్రసాద్, మోహన్ వడ్లపట్ల ఈ సినిమాకు బాగా సపోర్ట్ చేస్తున్నారు, వారికి స్పెషల్ థాంక్స్. సెప్టెంబర్ 6న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమా విజయం సాధిస్తుందని, అందుకు అందరి సహకారం కావాలని కోరారు.

నటీనటులు: జీవా, నయనతార

సాంకేతిక నిపుణులు:

నిర్మాత: జక్కుల నాగేశ్వరరావు

సంగీతం: శ్రీకాంత్‌ దేవా, సాహిత్యం : వెన్నెలకంటి, చంద్రబోస్‌

మాటలు: రాజశేఖర్‌ రెడ్డి

పి.ఆర్.ఓ: వి.ఆర్.మధు

కథ, స్క్రీన్‌‌ప్లే, దర్శకత్వం: ఆర్‌. ఎస్‌. రామనాథం.

Veede Sarainodu Movie Ready to Release:

Veede Sarainodu Movie Release on Sep 06
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs