Advertisement
Google Ads BL

మళ్లీ ప్రభాస్ సెంటిమెంట్‌కు బలయ్యాడు


రాజమౌళిలాంటి దర్శకుడితో సినిమాలు చెయ్యడం హీరోలకు ఓ కల. రాజమౌళి హీరోలకు బ్లాక్ బస్టర్స్ హిట్స్ ఇస్తాడు కాబట్టే.. ఆయనతో సినిమాలకు హీరోలు వెనుకాడరు. అయితే రాజమౌళి తో సినిమాలు చేసే హీరోలకు ఆ సినిమా హిట్ తర్వాత ప్లాప్ పడుతుంది అనే సెంటిమెంట్ టాలీవుడ్ లో ప్రముఖంగా వినబడుతుంది. రాజమౌళి తో మొదటి నుండి చేసిన హీరోలెవరికైనా ఇదే సెంటిమెంట్ వర్తించింది. నితిన్, ఎన్టీఆర్, చరణ్, ప్రభాస్, రవితేజ, సునీల్ లాంటి హీరోలకు రాజమౌళి సినిమాల తర్వాత పక్కాగా మరో ప్లాప్ పడింది. అప్పుడు చత్రపతి తర్వాత.. తాజాగా బాహుబలి తర్వాత ప్రభాస్ ఇదే సెంటిమెంట్‌కి మరోసారి బలైపోయాడనే టాక్ టాలీవుడ్ సర్కిల్స్ లో వినబడుతుంది.

Advertisement
CJ Advs

బాహుబలి లాంటి క్రేజీ బ్లాక్ బస్టర్ తరవాత ప్రభాస్ అదే రేంజ్ తో సాహో సినిమా చేసాడు. సుజిత్ లాంటి చిన్న దర్శకుడితో భారీ బడ్జెట్ చిత్రాన్ని చేసాడు. సాహో సినిమాని కూడా బాహుబలి రేంజ్ లో తెరకెక్కించి.. భారీగా ప్రమోట్ చేసి విడుదల చేశారు. కానీ ప్రభాస్ బాహుబలి రేంజ్ హిట్ సాహో తో అందుకోలేకపోయాడు. సాహో సినిమాకి మొదటి షోకే నెగెటివ్ టాక్ స్ప్రెడ్ అయ్యింది. బాహుబలి క్రేజ్ తో ప్రభాస్ సాహో కి భారీ ఓపెనింగ్స్ అయితే వచ్చాయి కానీ.. టాక్ మాత్రం బాలేదు. సినిమాకి క్రిటిక్స్ నుండి.. ప్రేక్షకులనుండి నెగెటిక్ టాక్ పడింది. మరి లాంగ్ వీకెండ్ అయినా సాహో ని ఆదుకుంటుందా.. అంటే ఇంత భారీ బడ్జెట్ చిత్రాన్ని ఒక్క లాంగ్ వీకెండ్ ఆదుకోవడం, అది ఈ టాక్ తో జరిగే పనే కాదు. అందుకే ప్రభాస్ కూడా రాజమౌళి సెంటిమెంట్ కి బలైపోయాడని.. అందరూ బహిరంగంగానే అంటున్నారు.

Rajamouli Effect On Young Rebel Star:

Prabhas Gets flop with Rajamouli sentiment
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs