Advertisement
Google Ads BL

సాహో’ బ్యాడ్ బాయ్ భామకు షాకింగ్ శాలరీ!


ఈరోజు శుక్రవారం వరల్డ్ వైడ్‌గా భారీగా అత్యధిక థియేటర్స్ లో విడుదలైన సాహో క్రేజ్ ఎలా ఉందో.. థియేటర్స్ దగ్గర సందడి చూస్తేనే అర్ధమవుతుంది. బాహుబలి తరవాత రెండేళ్లకు ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ప్రభాస్.. సాహో పై ప్రభాస్ కోటి ఆశలు పెట్టుకున్నారు. మరి ప్రభాస్ ఫాన్స్ అంచనాలకు తగ్గట్టుగా తెరకెక్కిన సాహో రికార్డులు కొల్లగొట్టడానికి తయారయ్యింది. శ్రద్దా కపూర్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమా యాక్షన్ ఎంటర్టైనర్ గా 300కి పైగా కోట్ల బడ్జెట్ తో తెరకెక్కింది. ఈ సినిమాకోసం ప్రభాస్ రెమ్యునరేషన్ క్లారిటీ లేదుకానీ.. హీరోయిన్ శ్రద్దా కపూర్ మాత్రం 3 నుండి 4 కోట్లు అందుకుంది అన్నారు.

Advertisement
CJ Advs

రెండేళ్ల కష్టానికి శ్రద్దా కపూర్ అందుకున్నపారితోషకం చాలా చిన్నది. ఎందుకంటే సాహోలో శ్రద్ద కపూర్, ప్రభాస్ పక్కనే ట్రావెల్ చేస్తూ సినిమా మొత్తం ఉన్న పాత్ర కావడంతో.. శ్రద్ద ఈ సినిమా కోసం చాలా కష్టపడింది. అయితే ఈ సినిమాలో బ్యాడ్ బాయ్ అంటూ ఐటెం సాంగ్ లో అందాలు ఆరబోసిన జాక్వలిన్ ఫెర్నాండేజ్ మాత్రం భారీ పారితోషకం అందుకున్నట్లుగా ఫిలింనగర్ టాక్. సినిమాలోని మిగతా పాటలకన్నా.. కాస్త ఇంట్రెస్టింగ్ గా ఈ బ్యాడ్ బాయ్ పాటే ఉండబోతుందని.. ఆ సాంగ్ విజువల్స్ చూస్తుంటే తెలుస్తుంది. ఇక ఈ సాంగ్ లో జాక్వలిన్ ఫెర్నాండేజ్ గ్లామర్ షో అంతా ఇంతా కాదు.. అందుకే ఈ ఒక్క సాంగ్ కోసం జాక్వలిన్ దాదాపుగా 2 కోట్లు అందుకుంది అని సమాచారం. ఇక ఆ సాంగ్ ని అత్యంత అందమైన లొకేషన్స్ లో చిత్రీకరించారని చెబుతున్నారు. ఆ పాట కోసం ఖర్చు కూడా భారీగానే అయ్యిందట.

Jacqueline Fernandez Remuneration for Saaho Bad boy Song:

Shocking Remuneration to Jacqueline Fernandez for Saaho
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs