Advertisement
Google Ads BL

పాయల్‌ను సెక్సువల్ కమిట్మెంట్ అడిగిందెవరు!!


హాలీవుడ్ మొదలుకుని బాలీవుడ్‌, టాలీవుడ్ వరకూ నటీమణులపై జరుగుతున్న క్యాస్టింగ్ కౌచ్‌పై ‘మీటూ’ ఉద్యమాన్ని లేవనెత్తిన విషయం విదితమే. ఇప్పటికీ ఈ వివాదంలో చిక్కుకున్న కొందరు నటులు, ఆర్టిస్ట్‌లు లాక్కోలేక పీక్కోలేక నానా తంటాలు పడుతున్నారు. అయితే మీటూ ఉద్యమం మొదలైన పరిస్థితులు చక్కబడ్డాయ్ అని అందరూ భావించారు. అబ్బే.. అదేం లేదు మీటూ ఉద్యమం ఓ రేంజ్‌లో నడుస్తున్నా క్యాస్టింగ్ కౌచ్ మాత్రం నడుస్తూనే ఉందని హాట్ భామ పాయల్ రాజ్‌పుత్ చెప్పుకొచ్చింది.

Advertisement
CJ Advs

‘మీటూ ఉద్యమం ఓ స్థాయిలో నడిచిన సమయంలో కూడా కాస్టింగ్ కౌచ్ కొనసాగింది. కొందరు కొత్త హీరోయిన్స్ చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నేను ‘ఆర్ ఎక్స్ 100’ చేసిన తర్వాత పెద్ద సినిమాల్లో ఆఫర్లు ఇప్పిస్తామని కొందరు నా వద్దకు వచ్చారు. అందుకు ప్రతిఫలంగా వారికి సెక్సువల్‌గా కమిట్ మెంట్ ఇవ్వాలని కోరారు. అయితే నేను అందుకు ఒప్పుకోలేదు. అందుకే పలు సినిమాల్లో ఆఫర్లు వదులుకోవాల్సి వచ్చిందని చెప్పుకొచ్చింది. లైంగికంగా సుఖంను అందించి సినిమాల్లో ఛాన్స్‌లు దక్కించుకోవాలని నేను అనుకోవడం లేదు’ అని పాయల్ చెప్పింది. అయితే ఆమెను కమిట్మెంట్ అడిగిందెవరు..? అనే విషయాన్ని బయటపెట్టేందుకు మాత్రం పాయల్ సాహసించలేదు. కాగా.. ఈ హాట్ హాట్ కామెంట్స్‌ ఇండస్ట్రీ పెద్దల నుంచి ఎలాంటి రియాక్షన్ వస్తుందో వేచి చూడాల్సిందే మరి.

RX100 actress Payal Rajput opens up on casting couch :

RX100 actress Payal Rajput opens up on casting couch
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs