Advertisement
Google Ads BL

‘సరిలేరు..’కు షాకిచ్చిన సీడేడ్‌ బయ్యర్!


సూపర్ స్టార్ మహేష్ బాబు అండ్ అనిల్ రావిపూడి కాంబినేషన్ లో తెరకెక్కుతున్న భారీ చిత్రం ‘సరిలేరు నీకెవ్వరు’కి అప్పుడే బయ్యర్స్ కూడా ఫిక్స్ అయ్యిపోయారు. నిర్మాత దిల్ రాజు పాత బయ్యర్స్‌నే ఫిక్స్ చేసాడట. మహర్షి సినిమాను కొన్న డిస్ట్రిబ్యూటర్స్‌కే ఈ సినిమాను ఇవ్వనున్నాడు దిల్ రాజు. ఆంధ్ర, నైజాం ఓకే కానీ సీడేడ్ డిస్కషన్స్ జరుగుతున్నాయి. 

Advertisement
CJ Advs

సీడెడ్‌లో మహర్షి సినిమాను శోభన్ అనే బయ్యర్ 12 కోట్ల మేరకు కొన్నాడు. కానీ మహర్షి సినిమాకి ఆయనకి దగ్గర దగ్గరగా రెండు కోట్లు లాస్ వచ్చింది. ఇప్పుడు సరిలేరు నీకెవ్వరు సినిమాను కూడా మళ్లీ అదే 12 కోట్లు రేట్ చెప్పారు. దాంతో అయన నో చూపినట్టు తెలుస్తుంది. బ్లాక్ బస్టర్ అని చెప్పుకున్న మహర్షి కే 2 కోట్లు లాస్ వచ్చింది అలాంటిది సరిలేరు నీకెవ్వరు సినిమా సంక్రాంతి సీజన్‌లో త్రివిక్రమ్ - బన్నీ ల సినిమాకి పోటీగా, అలానే రజినీకాంత్ సినిమాకి పోటీగా రిలీజ్ అవుతుంది.

ఈటైంలో 12 కోట్లు రేటు అంటే కష్టమని బయ్యర్ శోభన్ స్పష్టం చేసినట్లు ట్రేడ్ వర్గాల బోగట్టా. 10 కోట్లుకి అయితే ఓకే అని లేకపోతే వేరే వాళ్ళకి ఇచ్చేయమని చెప్పినట్టు తెలుస్తుంది. మరి ఈ కండీషన్ కి దిల్ రాజు ఒప్పుకుంటాడో లేదో చూడాలి.

Ceded Buyer gives Shock to Sarileru Neekevvaru Producers:

Sarileru Neekevvaru Ceded area business on hold
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs