Advertisement
Google Ads BL

‘RDX లవ్’ టీజర్: ‘సేఫ్టీ’ పాటించేటోళ్లకే..!


RX 100, అర్జున్ రెడ్డి సినిమాల తర్వాత ఆ కోవకు చెందిన సినిమాలంటూ చాలా సినిమాలు.. బోల్డ్ కంటెంట్ తో విచ్చలవిడిగా ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. అర్జున్ రెడ్డి లో లిప్ కిస్సులతో సరిపెడితే.. RX 100 లో ఒక పల్లెటూరి యువకుడు కార్తికేయ మీద కామం తీర్చుకునే నెగెటివ్ పాత్రలో పాయల్ రాజ్ ఫుత్ చాలా బోల్డ్ గా నటించింది. ఆ తర్వాత బూతు కంటెంట్ తో వచ్చిన సినిమాలన్నీ.. ప్రేక్షకులు తిప్పికొట్టారు. మళ్లీ ఇన్ని రోజులకి RX 100 బ్యూటీ పాయల్ రాజపుట్ మత్తెక్కించే ఘాటు హాటు అందాలతో నటించిన ‘RDX లవ్’ మతులు పోగొడుతుంది. నిన్నమొన్నటివరకు గ్లామర్ గా హాట్ గా వున్న ఫొటోలతో సరిపెట్టిన టీం తాజాగా RDX టీజర్ ని వదిలింది.

Advertisement
CJ Advs

పూర్తిగా యూత్‌ని టార్గెట్ చేస్తూ కట్ చేసిన RDX టీజర్ పాయల్ అందాల ఆరబోత, బోల్డ్ యాక్టింగ్.. పచ్చి పచ్చి వల్గర్ డైలాగ్స్ తో టీజర్ ని నింపేశారు. అస్సలు ఎలాంటి సిగ్గు బిడియం లేకుండా పాయల్ రాజపుత్ ఈ సినిమాలో నటించింది. తేజస్ హీరోగా పాయల్ రాజపుత్ హీరోయిన్ గా తెరకెక్కిన RDX లవ్ టైటిల్ కి తగ్గట్టే కనబడుతుంది. ప్రేమ పక్కన పెడితే.... పెద్దవాళ్ళు లేనప్పుడు ఫీలింగ్స్ ని అదుపులో పెట్టుకోవాలంటూ.. పచ్చిగా మాట్లాడే అమ్మాయి కేరెక్టర్ లో పాయల్ బాగానే కనిపిస్తుంది. బోల్డ్ నెస్ మీద దర్శకనిర్మాతలు ఎంతగా ఆధారపడ్డారో ఈ టీజర్‌తో తెలిసిపోతుంది. టీజర్ లోనే ఇంత బోల్డ్ కంటెంట్ కనబడుతుంటే.. సినిమాలో ఇంకెంతుంటుందో అనే క్యూరియాసిటీ యూత్ లో కలగించారనడంలో సందేహమే లేదు. ఇక ఈ సినిమాకి మెయిన్ హైలెట్ పాయల్ అందాల ఆరబోత, ఆమె బోల్డ్ కంటెంట్ మాత్రమే. ఇక రొమాంటిక్ హాట్ సన్నివేశాలు కూడా కావాల్సినన్ని కనబడుతున్నాయి.

Click Here for Teaser

RDX Love Teaser: Safety Not Guaranteed:

RDX Love Teaser Review
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs