సాయి పల్లవిపై ఎప్పటి నుంచో ఒక వార్త నడుస్తోంది. అదే ఆమెకు ఇంపార్టెన్స్ ఉన్న కథలు మాత్రమే చేస్తాను అనడమే ఆ వార్త సారాంశం. ఈ భామకు ఎవరు కథ చెప్పడానికెళ్లినా వారితో రెండేసి గంటలు కథ విని ఇందులో హీరోయిన్‌కి ఇంపార్టెన్స్ లేదు సో నేను ఈ కథ చేయను అని మొహం మీద చెప్పేయడం సాయి పల్లవి ఎప్పటినుండో చేస్తుంది.
అసలు సాయి పల్లవి కి టాలీవుడ్‌లో హీరో సెంట్రిక్ సినిమాలే వస్తుంటాయి తెలుసు. కానీ తనను దృష్టిలో పెట్టుకుని కథలు రాయాలనుకోవడం అతివివేకం. ఒకప్పుడు ఆమెకు మార్కెట్ ఉంది కాబట్టి ఆమె ఎలా చెబితే అలా చేసేవారు. కానీ ఇప్పుడు ఆమెకు వరుస ఫ్లాపులతో మునుపటి మాదిరిగా ఓపెనింగ్స్ కూడా రావడం లేదు. దాంతో నిర్మాతలు అండ్ డైరెక్టర్స్ ఆమెను పటించుకోవడంలేదు.
ఇప్పటికే కొంతమంది నిర్మాతలు ఆమెను అసలు కన్సిడర్ చేయడం లేదు. ఒకవేళ దర్శకులు కావాలి అని కోరినా ప్రొడ్యూసర్స్ ససేమీరా అంటున్నారు. సాయి పల్లవి ఇలా చేస్తే ఆమె పరిస్థితి కూడా నిత్య మీనన్‌లో అయిపోతుంది అని హెచ్చరిస్తున్నారు. సో.. సాయి పల్లవి ఇవన్నీ ఆలోచించుకుని నడిస్తే మంచిది.