మెగాస్టార్ చిరంజీవి లీడ్ పాత్రలో వస్తున్నా సైరా సినిమా అక్టోబర్ 2 న వరల్డ్ వైడ్ గా రిలీజ్ కి సిద్ధం అవుతుంది. ఈ నేపథ్యంలో ఈసినిమా యొక్క ప్రీ బిజినెస్ జరుగుతుంది. ఈసినిమా యొక్క నైజాం రైట్స్ యువి క్రియేషన్స్ తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. యువి క్రియేషన్స్ వారు రామ్ చరణ్ మంచి స్నేహితులు కాబట్టి ఈ రైట్స్ తీసుకున్నట్టు తెలుస్తుంది.
30 కోట్లు కు యువి క్రియేషన్స్ సైరా రైట్స్ దక్కించుకుంది. ముప్పై కోట్లు అంటే కొంచం రీజనబుల్ అనే అనుకోవాలి. సినిమా హిట్ అయితే ఇది పెద్ద మ్యాటర్ కాదు. మహర్షి సినిమా కి నైజాం లో జిఎస్టీ కాకుండా 26 కోట్ల వరకు వచ్చింది. ఇప్పుడు సైరా భారీ చిత్రం కాబట్టి హిట్ అయితే 30 కోట్లు సరదాగా వస్తాయని ట్రేడ్ చెబుతుంది.
ఇక ఆంధ్ర లో 60 కోట్ల రేషియోలో లెక్కకట్టి ఉత్తరాంధ్ర హక్కులు 14.50 కోట్లకు క్రాంతి పిక్చర్స్ కు ఇచ్చినట్లు తెలుస్తోంది. మిగిలిన ఏరియాస్ రైట్స్ సంప్రదింపులు జరుగుతున్నాయి.