Advertisement
Google Ads BL

ధృవ స‌ర్జా, ర‌ష్మికల ‘పొగ‌రు’ అప్డేట్ ఇదే!


చిత్రీక‌ర‌ణ ద‌శ‌లో ధృవ స‌ర్జా, ర‌ష్మిక మంద‌న్నా ‘పొగ‌రు’

Advertisement
CJ Advs

యాక్ష‌న్ కింగ్ అర్జున్ మేన‌ల్లుడు, కన్న‌డ హీరో ధృవ హీరోగా రూపొందుతోన్న చిత్రం ‘పొగ‌రు’. శ్రీ జ‌గ‌ద్గురు మూవీస్ బ్యాన‌ర్‌పై బి.కె.గంగాధ‌ర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సెన్సేష‌న‌ల్ బ్యూటీ ర‌ష్మిక మంద‌న్నా హీరోయిన్‌గా న‌టిస్తుంది. నంద‌కిషోర్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు.  ఫ్రెంచ్‌ బాడీ బిల్డ‌ర్ మోర్గాన్ అస్తే, అమెరిక్ ఐ.ఎఫ్‌.బి.బి ప్రొఫెష‌న‌ల్ బాడీ బిల్డ‌ర్ కై గ్రీనే, ఇంట‌ర్నేష‌న‌ల్ అథ్లెట్ ఎవాల్యుయేష‌న్ స్పోర్ట్స్ న్యూటీష‌న్ జాన్ లుకాస్‌, జర్మ‌న్ ఫిట్‌నెస్ సెన్సేష‌న్ జో లిన్‌డ‌ర్ వంటి ఇంట‌ర్నేష‌న‌ల్ బాడీ బిల్డ‌ర్స్ ఈ చిత్రంలో న‌టిస్తున్నారు.

ప్ర‌స్తుతం సినిమా చిత్రీక‌ర‌ణ తుది ద‌శ‌కు చేర‌కుంది. కొన్ని రోజులుగా హైద‌రాబాద్ రామోజీ ఫిలిమ్ సిటీలో లాంగ్ షెడ్యూల్ షూటింగ్ జ‌రుగుతోంది. హీరో ధృవ స‌ర్జాకు, ఇంట‌ర్నేష‌న‌ల్ బాడీ బిల్డ‌ర్స్‌కు మ‌ధ్య జ‌రిగే క్లైమాక్స్ సినిమాకే హైలెట్‌గా నిల‌వ‌నుంది. భైర‌వ‌గీత ఫేమ్ ధ‌నుంజ‌య్ ఈ సినిమాలో విల‌న్‌గా న‌టిస్తున్నారు. సంప‌త్ రాజ్‌, ర‌వి శంక‌ర్‌, ప‌విత్రా లోకేష్ త‌దిత‌రులు ఇత‌ర ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. విజ‌య్ మిల్ట‌న్ సినిమాటోగ్ర‌ఫీ అందిస్తున్నారు. ప్యాన్ ఇండియా చిత్రంగా ఈ సినిమాను విడుద‌ల చేయ‌డానికి నిర్మాత స‌న్నాహాలు చేస్తున్నారు. 

న‌టీన‌టులు: 

ధృవ స‌ర్జా, ర‌ష్మిక మంద‌న్నా, సంప‌త్ రాజ్‌, రాఘ‌వేంద్ర కుమార్‌, ర‌విశంక‌ర్‌, ప‌విత్రా లోకేష్‌, ధ‌నుంజ‌య్‌, మ‌యూరి, సాధుకోకిల‌, చిక్క‌న్న, త‌బ్లా నాని, కురి ప్ర‌తాప్‌, కైగ్రీనే, మోర్గాన్ అస్తే, జాన్ లుకాస్‌, జోలిండ‌ర్ త‌దిత‌రులు

సాంకేతిక వ‌ర్గం:

ద‌ర్శ‌క‌త్వం: న‌ంద‌కిషోర్‌

నిర్మాత‌:  బి.కె.గంగాధ‌ర్‌

సినిమాటోగ్ర‌ఫీ:  విజ‌య్ మిల్ట‌న్‌

ఆర్ట్‌:  బ్ర‌హ్మ క‌డ‌లి, మోహ‌న్ బి.కేరే

పి.ఆర్‌.ఒ: వ‌ంశీ శేఖ‌ర్‌

Dhruva Sarja and Rashmika Mandanna’s ‘Pogaru’ Update:

Pogaru is in final stages of shoot and currently a long schedule is going on in Ramoji Film City
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs