Advertisement
Google Ads BL

‘పహిల్వాన్‌’పై సల్మాన్‌ఖాన్ ప్రశంసలు


‘పహిల్వాన్‌’ని అభినందించిన బాలీవుడ్ స్టార్ సల్మాన్‌ఖాన్

Advertisement
CJ Advs

శాండిల్‌వుడ్ బాద్షా సుదీప్‌ను బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ ప్రత్యేకంగా అభినందించారు. కిచ్చా సుదీప్ టైటిల్ పాత్ర‌లో న‌టిస్తోన్న చిత్రం ‘పహిల్వాన్‌’.  ఈ యాక్ష‌న్ డ్రామాలో సుదీప్ రెజ్ల‌ర్ పాత్ర‌లో క‌నిపిస్తారు. తెలుగు, కన్నడ, హిందీ, తమిళ, మలయాళ భాషల్లో ‘పహిల్వాన్‌’ అనే పేరుతో సెప్టెంబ‌ర్ 12న‌ ఈ చిత్రాన్ని విడుద‌ల చేయ‌డానికి నిర్మాత‌లు ప్లాన్ చేస్తున్నారు.  ఈ సినిమా ట్రైలర్‌ను ఇటీవల 5 భాషల్లో విడుదల చేశారు. ట్రైలర్‌లో సుదీప్ లుక్, ఆకట్టుకునే యాక్షన్ సన్నివేశాలు, సంభాషణలతో ట్రైలర్‌కు ట్రెమెండస్ రెస్పాన్స్ వచ్చింది. ఈ ట్రైలర్‌తో 5 భాషల్లో విడుదలవుతున్న ఈ సినిమాపై అంచనాలు రెట్టింపు అయ్యాయి. ఈ నేపథ్యంలో ఇటీవల ట్రైలర్‌ను వీక్షించిన సల్మాన్ ఖాన్.. సుదీప్‌ను కలుసుకున్నప్పుడు సినిమా గురించి ప్రస్తావించారు. ట్రైలర్ చాలా బావుందని, లుక్, మేకింగ్, యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరించిన విధానం బావుందని సుదీప్ సహా ఎంటైర్ యూనిట్‌ను అభినందించారు. బాలీవుడ్ స్టార్ సల్మాన్ తమ చిత్రాన్ని అప్రిషియేట్ చేయడంపై చిత్ర యూనిట్ ఆయనకు ప్రత్యేకమైన కృతజ్ఞతలను తెలియజేసింది. ఎస్‌.కృష్ణ ద‌ర్శ‌కత్వం వహించిన ఈ సినిమాను ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ వారాహి చ‌ల‌న చిత్రం తెలుగు ప్రేక్ష‌కుల‌కు అందిస్తున్నారు. ఈ చిత్రంలో బాలీవుడ్ న‌టుడు సునీల్ శెట్టి, ఆకాంక్ష సింగ్ కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. 

అర్జున్ జ‌న్యా సంగీతం అందించిన ఈ సినిమాకు క‌రుణాక‌ర్ సినిమాటోగ్ర‌ఫీ అందించారు. ‘కె.జి.య‌ఫ్‌’ చిత్రాన్ని తెలుగులో విడుద‌ల చేసి ఘ‌న విజ‌యాన్ని అందుకున్న వారాహి చ‌ల‌న చిత్రం ఇప్పుడు ‘పహిల్వాన్‌’ చిత్రాన్ని సెప్టెంబ‌ర్ 12న  గ్రాండ్ రిలీజ్  చేస్తున్నారు.

Salman Khan Praises Kiccha Sudeep Pehlwan:

Pehlwan Team Happy with Salman Khan Praises
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs