యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ లేటెస్ట్ సెన్సెషన్ సాహో మరో నాలుగు రోజుల్లో రిలీజ్ కాబోతుంది. రిలీజ్ డేట్ దగ్గర పడేకొద్దీ సోషల్ మీడియాలో ఈమూవీకి సంబంధించి రోజుకొక న్యూస్ బయటకు వస్తుంది. ముఖ్యంగా ప్రభాస్ క్యారెక్టరైజేషన్ గురించి. ఈమూవీలో ప్రభాస్ క్యారెక్టరైజేషన్ హైలెట్. సినిమాలో ప్రభాస్ పాత్రలో ఉన్న షేడ్స్ సినిమాని మరో స్థాయికి తీసుకుని వెళ్తుందని అర్ధం అవుతుంది. మధ్యమధ్యలో వచ్చే అతడి మేకోవర్ టోటల్ సినిమాకు హైలెట్ కాబోతోంది.
స్టోరీ రెగ్యులర్ అయినప్పటికీ ఇది స్క్రీన్ ప్లే బేస్డ్ మూవీ అని టీం అంత ఎప్పటినుండో చెబుతుంది. ట్విస్టులు కి ఏమి డోకా ఉండదు అని ప్రేక్షకులు బాగా థ్రిల్ అవుతారు అని తెలుస్తుంది. ఈమూవీ గురించి మాట్లాడుకోవాలంటే ప్రీ క్లైమాక్స్ అండ్ క్లైమాక్స్ గురించి మాట్లాడుకుంటారు అని చెబుతున్నారు. ఆఖరి 30 నిముషాలు నభూతో.. అనే రేంజ్ లో ఉండనుందట. యాక్షన్ సీన్స్ తో పాటు ఈమూవీలో చిన్నపాటి ఫాదర్ సెంటిమెంట్ యాంగిల్ కూడా ఉంది.
ఆల్రెడీ వరల్డ్ వైడ్ ప్రీ బుకింగ్స్ ఓపెన్ అయిపోయాయి. ట్రేడ్ పరంగా ఇది తొలిరోజు ప్రపంచవ్యాప్తంగా 120 కోట్ల రూపాయలు వసూలు చేసే అవకాశం ఉందంటున్నారు. ఏమో ఏం అవుతుందో మరో నాలుగు రోజుల్లో తెలిసిపోనుంది. ప్రభాస్ అండ్ టీం అంతా ఈమూవీ పై చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారు.