తెలంగాణ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఎలక్షన్స్
తెలంగాణ ఫిలింఛాంబర్ ఆఫ్ కామర్స్ ఎలక్షన్స్ ఈ రోజు హైదరాబాద్ లో జరిగాయి. దీనికి ప్రెసిడెంట్ గా పి. రామకృష్ణ గౌడ్, ప్రధాన సలహాదారుడిగా ప్రముఖ నిర్మాత ఏ.యమ్ రత్నం, వైస్ ప్రెసిడెంట్ గా నిర్మాత గురు రాజ్, రంగా రవీంద్ర గుప్త, అలీ భాయ్, సెక్రెటరీస్ గా కె .వి. రమణా రెడ్డి, కె .సత్యనారాయణ, ఆర్గనైజయింగ్ సెక్రెటరీస్ గా వి. మధు, పూసల కిశోర్, రవీంద్ర గౌడ్, జాయింట్ సెక్రెటరీస్ గా సతీష్, నాగరాజు గౌడ్, జి. శంకర్ గౌడ్, కోశాధికారిగా రామానుజం ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. వీరితో పాటుగా ఈసీ మెంబర్స్ గా వి. కృష్ణ రావు, హెచ్ కృష్ణ రెడ్డి, అలెక్స్, ఇ .సదాశివరెడ్డి, రాజు నాయక్, వెంకటేష్ గౌడ్, టి. శ్రీనివాస్ గౌడ్, టి. రాజేష్, ఎమ్. వెంకటేష్, ముఖావర్ వలి, మహాలక్ష్మి , బి. నాగరాజు (జడ్చెర్ల ) ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
ఎలక్షన్స్ అనంతరం తెలంగాణ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రెసిడెంట్ పి . రామకృష్ణ గౌడ్ మాట్లాడుతూ ... ‘‘తెలంగాణ ఫిలిం ఛాంబర్ బిల్డింగ్ నిర్మాణానికి స్థల కేటాయింపు, పది ఎకరాల్లో సినీ వర్కర్స్ ఇళ్ల కోసం స్థల కేటాయింపు, కల్చరల్ సెంటర్ కోసం స్థల కేటాయింపుతో పాటు 24 క్రాఫ్ట్స్ లో వర్కర్స్ అందరికీ పని దొరికేలా చూస్తాం. త్వరలో తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ గారిని కలిసి ఇవ్వన్నీ ప్రభుత్వం ద్వారా చేయాలనీ తీర్మానించుకున్నాం’’ అన్నారు.