Advertisement
Google Ads BL

పొలిటికల్ సెటైర్‌గా ‘జోహార్’


ధర్మ సూర్య పిక్చర్స్ పతాకంపై తేజ మార్ని దర్శకత్వంలో భాను సందీప్ మార్ని నిర్మాతగా రూపొందుతోన్న ఎమోషనల్ డ్రామా ‘జోహార్’. ‘దశ్యం’ చిత్రంలో వెంకటేశ్ కూతురిగా నటించిన ఈస్తర్ అనిల్ ఇందులో హీరోయిన్‌గా నటించారు. ‘వంగవీటి’ ఫేమ్ నైనా గంగూలీ మెయిన్ హీరోయిన్‌గా నటించారు. తనదైన నటనతో ఎన్నో చిత్రాల్లో మెప్పించిన ప్రముఖ క్యారెక్టర్ ఆర్టిస్ట్ ఈశ్వరీరావు ఈ చిత్రానికి బ్యాక్‌బోన్‌లాంటి పాత్రలో నటించారు. రోహిణి, శుభలేఖ సుధాకర్, చైతన్యకృష్ణ తదితరులు ప్రధాన పాత్రల్లో నటించారు. చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలను జరుపుకుంటోంది. ఈ సినిమా ప్రీ లుక్‌ను విడుదల చేశారు. 

Advertisement
CJ Advs

ఈ సందర్భంగా దర్శకుడు తేజ మార్ని మాట్లాడుతూ.. ‘‘నేను ప్రముఖ డైరెక్టర్ రామ్‌గోపాల్ వర్మగారి వద్ద ‘వంగవీటి’ చిత్రానికి దర్శకత్వ శాఖలో పనిచేశాను. అలాగే ప్రముఖ రచయిత విజయేంద్ర ప్రసాద్‌గారి వద్ద రచనా విభాగంలో పనిచేశాను. డైరెక్టర్ గా నా తొలి చిత్రమిది. ‘జోహార్’ చిత్రం పొలిటికల్ సెటైర్‌గా రూపొందుతోన్న ఎమోషనల్ డ్రామా. షూటింగ్ పూర్తయ్యింది. పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. సినిమా ప్రధానంగా ఐదు పాత్రల చుట్టూ తిరుగుతుంది. ఐదు పాత్రలు అద్భుతంగా ఆకట్టుకుంటాయి. డిఫరెంట్‌గా ఉంటాయి. వారణాసి, రాజమండ్రి, కాకినాడ, వైజాగ్ ప్రాంతాల్లో సినిమాను చిత్రీకరించాం. ‘భైరవగీత’ చిత్రాన్ని డైరెక్ట్ చేసిన సిద్ధార్థ్ ఈ చిత్రానికి ఎడిటర్‌గా పనిచేశారు. త్రిష ‘నాయకి’, ‘భైరవగీత’ చిత్రాలకు వర్క్ చేసిన జగదీశ్ ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. చైతన్యప్రసాద్ పాటలు రాశారు. ‘రాక్షసుడు’, ‘జార్జిరెడ్డి’ చిత్రాలకు పనిచేసిన గాంధీ ఆర్ట్ డైరెక్టర్‌గా పనిచేశారు’’ అన్నారు. 

నటీనటులు: 

ఈస్తర్ అనిల్, రోహిణి, శుభలేఖ సుధాకర్, ఈశ్వరీ రావు, నైనా గంగూలీ, అంకిత్ కొయ్య, చైతన్య కృష్ణ, సి.వి.ఎల్

Johar Pre look Released:

Announced to be an Emotional Drama entertainer, Johar is directed by Teja Marni, produced by Sandeep Marni under Dharma Surya Pictures banner.
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs