Advertisement
Google Ads BL

‘మన్మథుడు 2’ డైరెక్టర్.. మరో మూవీకి రెడీ!


‘అందాల రాక్షసి’ సినిమాతో వెండితెరకు పరిచయం అయిన హీరో రాహుల్ రవీంద్రన్ కొన్ని సినిమాలు మాత్రమే హీరోగా చేసి  ఆ తరువాత సైడ్ క్యారెక్టర్స్ చేసి ప్రస్తుతం సినిమాలను డైరెక్ట్ చేస్తున్నాడు. తన మొదటి సినిమా ‘చి.ల.సౌ’ తో డీసెంట్ హిట్ అందుకున్న రాహుల్ కు ఆ తరువాత కింగ్ నాగార్జున అతనికి ‘మ‌న్మ‌థుడు 2’ను డైరెక్ట్ చేసే ఛాన్స్ ఇచ్చాడు.

Advertisement
CJ Advs

రొమాంటిక్ ఎంటర్టైనర్‌గా తెరకెక్కిన ఈమూవీ ఈనెల(ఆగస్ట్) 9న రిలీజ్ అయ్యి ప్రేక్షకులని నిరాశపరిచింది. బాక్సాఫీస్ వద్ద ఈమూవీ డిజాస్టర్ గా మిగిలిపోవడంతో రాహుల్ తన నెక్స్ట్ సినిమా కోసం టైం తీసుకుంటాడేమో అనుకున్నారు కానీ అతను తన నెక్స్ట్ కోసం అప్పుడే రెడీ అయిపోయాడు. త్వరలోనే తన మూడో సినిమాను స్టార్ట్ చేయనున్నాడు.

అయితే హీరో ఎవరు అనుకుంటున్నారా? మన నేచురల్ స్టార్ నానినే. అవును వీరి కాంబినేషన్‌లో సినిమా అని వార్తలు వస్తున్నాయి. ఈమూవీని సితార ఎంటర్టైన్మెంట్స్‌ వారు నిర్మిస్తున్నారు. ప్రస్తుతం నాని గ్యాంగ్ లీడర్ సినిమా చేస్తున్నాడు. అలానే మోహన్ కృష్ణ ఇంద్రగంటితో మరో సినిమా చేస్తున్నాడు. ఈ రెండు సినిమాలు తరువాత రాహుల్‌తో సినిమా ఉండే అవకాశముంది.

Rahul Ravindran Ready to His 3rd Project:

Rahul Ravindran next Film with Natural Star Nani
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs