Advertisement
Google Ads BL

‘వాల్మీకి’ విషయంలో హరీష్ అస్సలు తగ్గట్లే!


సాహో సినిమా విడుదల ఆగష్టు 30 న అనగానే.. మరో వారంలో వస్తే వర్కౌట్ అవదని భావించిన హరీష్ శంకర్ - వరుణ్ తేజ్ లు తమ సినిమాని సెప్టెంబర్ 6 నుండి సెప్టెంబర్ 13 కి పోస్ట్ పోన్ చేసుకున్నారు. తమిళ సినిమా జిగర్తాండకి రీమేక్ గా తెరకెక్కుతున్న వాల్మీకి మీద మంచి అంచనాలున్నాయి. ఇప్పటికే వాల్మీకిలో వరుణ్ తేజ్ లుక్ పై అందరిలో మంచి ఇంట్రెస్ట్ క్రియేట్ చేసిన హరీష్ శంకర్.. ప్రమోషన్స్ తో సినిమాపై మరింత హైప్ పెంచుతున్నాడు. ఇప్పటికే టైటిల్ వివాదంలో ఉన్న వాల్మీకి సినిమాపై ట్రేడ్ లోను, ప్రేక్షకుల్లోనూ క్రేజ్ ఉంది. తాజాగా వాల్మీకి నిర్మాతలు తమ సినిమా డేట్ మార్చాలని భావిస్తున్నట్టుగా ఫిలింనగర్ టాక్.

Advertisement
CJ Advs

ఎందుకంటే నాని గ్యాంగ్ లీడర్ నిర్మాతలు, వాల్మీకి నిర్మాతలను రిక్వెస్ట్ చేశారట. వాల్మీకిని వారం వెనక్కి జరగమని గ్యాంగ్‌లీడర్‌ నిర్మాతలు వాల్మీకి నిర్మాతలను కోరుతున్నారట. ఇక వాల్మీకి నిర్మాతలు కూడా ఒప్పేసుకునే పరిస్థితిలో ఉంటే.. దర్శకుడు హరీష్ శంకర్ మాత్రం.. వద్దు మన చిత్రం సెప్టెంబర్ 13 కే దిగడం అని పట్టుబడుతున్నాడట. అసలు మన సినిమాకి గ్యాంగ్ లీడర్ సినిమా కథకి పొంతనే ఉండదు.. మీరెందుకు భయపడతారు అని వాల్మీకి నిర్మాతలకు సర్దిచెప్పడమే కాకుండా... వాల్మీకి సినిమా మీద అన్ని డెసిషన్స్ ఓన్ గా తీసుకుంటున్నాడట. 

ఎందుకంటే వాల్మీకి సినిమాకి పారితోషకం కాకుండా.. లాభాల్లో వాటా తీసుకుంటున్న హరీష్ కి నిర్మాతలు కూడా ఎదురు చెప్పలేకపోతున్నారట. ఇక హరీష్ శంకర్ వాల్మీకి సినిమా మాస్ ప్రేక్షకులను పడేయడం ఖాయమని చెప్పడమే కాదు.. సినిమాని భారీగా ప్రమోట్ చెయ్యాలనే ప్లాన్ లో ఉన్నాడట. కానీ వాల్మీకి నిర్మాతలు మాత్రం గ్యాంగ్ లీడర్ తో క్లాష్ వద్దని భావిస్తున్నారట. 

Harish Shankar Full confidence on Valmiki:

Harish Shankar Takes Strong Decision about Valmiki Release
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs