Advertisement
Google Ads BL

‘ఎంత మంచివాడవురా!’ కథ అదేనా?


శతమానం భవతి హిట్, శ్రీనివాస కళ్యాణం ప్లాప్ తర్వాత సతీష్ వేగేశ్న తో సినిమాలు చెయ్యడానికి చాలామంది హీరోలు వెనక్కి తగ్గారు. శతమానం భవతి హిట్ తర్వాత పెద్ద హీరోతో శ్రీనివాస కళ్యాణం చేద్దామనుకుంటే.. ఒక్క హీరో కూడా సతీష్ కి కమిట్ అవ్వలేదు. ఇక నితిన్ తో తీసిన ఆ సినిమా కాస్ట్ ఫెయిల్యూర్ గా నిలిచింది. తాజాగా సతీష్ వేగేశ్న తో.. చాలా రోజులకి 118 తో హిట్ కొట్టిన కళ్యాణ్ రామ్ కమిట్ అయ్యాడు. కళ్యాణ్ రామ్‌ని ‘ఎంత మంచివాడవురా!’గా సతీష్ వేగేశ్న చూపించబోతున్నాడు. తాజాగా విడుదలైన ఈ చిత్ర ఫస్ట్ లుక్‌తో సినిమా పై అందరిలో ఆసక్తి పెరిగింది. ఇక ఈ సినిమాని తనకి అచ్చొచ్చిన సంక్రాంతికి రిలీజ్ అంటూ సతీష్ వేగేశ్న విడుదల డేట్ కూడా కన్ఫర్మ్ చేసాడు. ఇక సంక్రాంతి బరిలో ఇద్దరు పెద్ద స్టార్స్ మహేష్ ‘సరిలేరు నీకెవ్వరు’, అల్లు అర్జున్ ‘అల వైకుంఠపురములో’ సినిమాలను ఎలా తట్టుకుంటావయ్యా అంటూ ‘ఎంత మంచివాడవురా!’ మీద కామెంట్స్ చేస్తున్నారు బడా స్టార్స్ ఫ్యాన్స్.

Advertisement
CJ Advs

తాజాగా కళ్యాణ్ రామ్ - సతీష్ వేగేశ్న ‘ఎంత మంచివాడవురా!’ కథ ఇదే అంటూ సోషల్ మీడియాలో ఓ స్టోరీ ప్రచారంలోకొచ్చింది. అదేమంటే.. ‘ఎంత మంచివాడవురా!’ సినిమా కథకు గుజరాతిలో గత ఏడాది వచ్చిన ఆక్సిజన్ అనే సినిమా కథ స్ఫూర్తి అంటూ ప్రచారం మొదలైంది. గుజరాతిలో గత ఏడాది వచ్చిన ఆక్సిజన్ హెవీ ఎమోషన్ తో బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. చిన్మయ్ పురోహిత్ దర్శకత్వంలో తెరకెక్కిన ఆక్సిజన్ సినిమాలో అన్షుల్ హీరోగా నటించాడు. ఇప్పుడు అదే ఆక్సిజన్ కథను తెలుగు నేటివిటీకి దగ్గరగా సతీష్ వేగేశ్న రాసుకున్నాడని... ఆ కథలో తన వాళ్లతో పాటుగా.. తనకు తెలియని వారికి కూడా మంచి చేయాలనుకునే ఒక అతి మంచి వాడి కథే అంటున్నారు. అందుకే సతీష్ వేగేశ్న ఈ సినిమా టైటిల్ కూడా ‘ఎంత మంచివాడవురా!’ అంటూ పెట్టారనే టాక్ మాత్రం సోషల్ మీడియాలో ఓ రేంజ్‌లో ప్రచారం జరుగుతుంది.

Gossips on Entha Manchi Vaadavuraa Movie Story line:

Entha Manchi Vaadavuraa Movie story line Revealed
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs