యంగ్ రెబల్‌స్టార్ ప్రభాస్, శ్రద్దా కపూర్ నటీనటులుగా యు.వి.క్రియేషన్స్ బ్యానర్‌పై.. సుజిత్ తెరకెక్కించిన చిత్రం ‘సాహో’. రూ.350కోట్లతో నిర్మితమైన ఈ భారీ చిత్రం ఆగస్ట్ 30న అభిమానుల ముందుకు వచ్చేస్తోంది. ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన లుక్స్, సాంగ్స్, టీజర్ అంచనాలను డబుల్ చేసేశాయి. ప్రమోషన్స్ కూడా గట్టిగానే చిత్రబృందం ముఖ్యంగా ప్రభాస్‌తో పెద్ద ఎత్తున ఇంటర్వ్యూలు చేయిస్తోంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో డార్లింగ్ ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.
సాహో తర్వాత తాను త్వరత్వరగా సినిమాలు చేయాలని భావిస్తున్నానని.. గత ఆరేళ్లుగా చాలా నెమ్మదిగా చిత్రాలు చేశానని ఇకపై అలా ఉండదని చెప్పుకొచ్చాడు. అంతేకాదు ఇకపై భారీ బడ్జెట్ సినిమాల్లో అస్సలు చేయనని తేల్చి చెప్పేశాడు. అలాంటి సినిమాల్లో చేయడం వల్ల చాలా ఒత్తిడికి గురికావాల్సి వస్తోందని ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు చెప్పాడు. అంతటితో ఆగని ఆయన.. ‘సాహో’ ఇన్ని కోట్లు రాబడుతుందని అంచనా వేయలేను.. చెప్పలేను కానీ.. బాహుబలి అభిమానులను ఎంటర్‌టైన్ చేయాలని అనుకుంటున్నానని చెప్పాడు.
‘సాహో’ కోం ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపాల్సి వచ్చిందని ప్రభాస్ చెప్పడం గమనార్హం. మొత్తానికి చూస్తే డార్లింగ్.. పెద్ద బడ్జెట్ సినిమాల్లో నటించడకూడదని ఈ సారి గట్టిగానే ఫిక్స్ అయ్యానని చెబుతున్నాడు.. ఇది ఏ మాత్రం వర్కవుట్ అవుద్దో వేచి చూడాలి మరి.