Advertisement
Google Ads BL

జూనియర్‌ను కాకా పడుతున్న చంద్రబాబు!?


జూనియర్ ఎన్టీఆర్.. టీడీపీ అధినేత నారా చంద్రబాబు కాకా పడుతున్నారా..? విధిలేని పరిస్థితిలో తప్పనిసరి అని తెలుసుకున్న బాబు.. ఎన్టీఆర్‌ను మచ్చిక చేసుకునే పనిలో నిమగ్నమయ్యారా..? అంటే తాజా పరిస్థితులను బట్టి చూస్తే ఇది అక్షరాలా నిజమనిపిస్తోంది. అసలు ఈ కథేంటో ఈ ప్రత్యేక కథనంలో చూద్దాం మరి.

Advertisement
CJ Advs

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో కనివినీ ఎరుగని రీతిలో ఘోరంగా పరాజయం పాలైన టీడీపీని ఇప్పట్లో గట్టెక్కించాలంటే కచ్చితంగా జూనియర్ ఎన్టీఆర్ అవసరం ఎంతైనా ఉందన్నది జగమెరిగిన సత్యం. ఈ తరుణంలో పనిలో పనిగా ఇటీవల దివంగత నేత నందమూరి హరికృష్ణ సంవత్సరీకం సందర్భంగా జూనియర్ ఇంటికెళ్లిన చంద్రబాబు.. ఇకపై పార్టీకోసం పనిచేయాలని ప్రత్యేకంగా ఆయనతో మాట్లాడినట్లు తెలుస్తోంది. సుమారు గంటపాటు ఎన్టీఆర్‌తో బాబు మంతనాలు జరిపి కాకా పట్టినట్లు సమాచారం.

పలువురు రాజకీయ విశ్లేషకులు, పార్టీలోని సీనియర్లు కొందరు ఎన్టీఆర్‌తో మీరే స్వయంగా మాట్లాడి ఒప్పించి పార్టీలోకి రప్పించుకోవాలని సలహా ఇచ్చారట. అందుకే పనిలో పనిగా జూనియర్‌తో మాట్లాడారని సమాచారం. జూనియర్ ఏం రిప్లై ఇచ్చారు అనేది తెలియాల్సి ఉంది. అయితే నిజంగానే జూనియర్‌తో బాబు మాట్లాడారా..? లేదా..? ఇందులో నిజానిజాలెంత..? అనేది మాత్రం తెలియరాలేదు.

News About Chandrababu-Jr Ntr:

News About Chandrababu-Jr Ntr  
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs