Advertisement
Google Ads BL

సల్మాన్‌తో.. చరణ్, ఎన్టీఆర్!


ఒక స్టేజి మీద బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్, రామ్ చరణ్, ఎన్టీఆర్ కలిసి డాన్స్ వెయ్యబోతున్నారా? ఒకే వేదికపై ఒకే ఫ్రేమ్ లో అభిమానులు వీక్షించే అరుదైన అవకాశం ఉందని తెలుస్తోంది. కాకపోతే ఇదంతా స్పెక్యులేషన్ మాత్రమే. ఎటువంటి అధికార ప్రకటన లేదు.

Advertisement
CJ Advs

అసలు మ్యాటర్ ఏంటంటే... ప్రతి ఏడాది బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ దబాంగ్ టూర్ పేరుతో ప్రపంచవ్యాప్తంగా డ్యాన్స్ టూర్లు నిర్వహిస్తున్న  సంగతి తెలిసిందే. అయితే ఈసారి ఈ ఈవెంట్ ను హైదరాబాద్ లో ‘దబాంగ్ 3’ టీమ్ అడుగు పెడుతోంది. అందుకు తగ్గ వేదిక కూడా ఫిక్స్ అయిపోయింది. హైదరాబాద్ లోని గచ్చిబౌలి స్టేడియంలో భారీ ఈవెంట్ ని ‘దబాంగ్ 3’ బృందం ప్లాన్ చేశారు. ఈ ఈవెంట్ లో సల్మాన్ తో పాటు సోనాక్షి- ప్రభుదేవా - జాక్విలిన్ ఫెర్నాండెజ్ - డెయిసీ షా పాల్గొననున్నారు.

సల్మాన్ కు రామ్ చరణ్ తో పరిచయం ఉంది కాబట్టి చరణ్ ఈ ఈవెంట్ లో పాల్గొననున్నాడని అర్ధం అవుతుంది. చరణ్ తో పాటు మెగా ఫ్యామిలీ కూడా ఈ ఈవెంట్ కి అటెండ్ అయ్యే అవకాశముంది. అలాగే వీళ్లతో పాటే యంగ్ టైగర్ ఎన్టీఆర్ సైతం ఈ ఈవెంట్ కి ఎటెండ్ అవుతారని అంతా అంచనా వేస్తున్నారు. రామ్ చరణ్ - ఎన్టీఆర్ లు ఇద్దరూ కలిసి స్టేజి మీద డాన్స్ వేస్తారు అని తెలుస్తుంది. ఈ ఈవెంట్ కి మూడు నెలలు టైం ఉంది కాబట్టి అప్పటికి ఈ వేదికపై ఆర్.ఆర్.ఆర్ ప్రమోషన్ ని ప్లాన్ చేసినా ఆశ్చర్యపోనక్కర్లేదని అంటున్నారు. దీని గురించి ఎటువంటి ప్రకటన లేదు ఇది నిజం అని నమ్మలేం.

RRR To Get Bigger Targets:

NTR, Charan To Join With Salman  
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs