ప్రస్తుతం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ ఏదైనా ఉంది అంటే అది సాహో సినిమా విడుదల న్యూస్ ఒకటి, రెండోది సైరా ప్రభంజనం పై న్యూస్. ఇక ముచ్చటగా మూడోది పూరి జగన్నాధ్ - విజయ్ దేవరకొండ కాంబోలో తెరకెక్కనున్న సినిమా విషయం. రౌడీ బ్రాండ్ ఇమేజ్ ఉన్న హీరో.. మాస్ డైరెక్టర్ కలిసి సినిమా చేస్తే... ఆ క్రేజ్ ఎలా ఉంటుందో ప్రస్తుతం ఇండస్ట్రీలో నడుస్తున్న చర్చే ఉదాహరణ. హీరోలను మాస్ గా చూపించడం పూరి స్టయిల్, ఇక విజయ్ దేవరకొండ రౌడీగా రెచ్చిపోయి అభిమానులను ఎంటర్టైన్ చేస్తాడు. మరి ఇస్మార్ట్ శంకర్ హిట్ ఊపుతో పూరి మంచి కసితో విజయ్ దేవరకొండ కోసం ఒక మాస్ కథని తయారు చేస్తున్నాడు. విజయ్ కూడా ప్రస్తుతం తాను చేస్తున్న సినిమాని త్వరగా పూర్తి చేసి పూరి కోసం వచ్చేస్తాడు.
ఇక పూరి - విజయ్ దేవరకొండ కాంబోలో తెరకెక్కబోయే సినిమా టైటిల్ ఇదే అంటూ సోషల్ మీడియాలో ఓ టైటిల్ ప్రచారంలోకొచ్చింది. పూరి టైటిల్స్ ని మాస్ ప్రేక్షకులు మెచ్చేవిలా ఉంటాయి. ఇది పోకిరి, లోఫర్, ఇస్మార్ట్ శంకర్ టైటిల్స్ పరిశీలిస్తే తెలుస్తుంది. తాజాగా విజయ్ దేవరకొండ కోసం పూరి జగన్నాధ్ కూడా ఓ మాస్ మసాలా టైటిల్ ని పెడుతున్నాడట. అదే ‘ఫైటర్’ అంటూ ప్రచారం జరుగుతుంది. మాస్ యాక్షన్ ఎంటర్టైనర్‌గా తెరకెక్కనున్న నేపథ్యంలో ఈ చిత్రానికి ‘ఫైటర్’ టైటిల్ చాలా బాగుంటుందని భావిస్తున్నాడట పూరి. మరి త్వరలోనే ఈ టైటిల్‌ని పూరి - ఛార్మిలు రిజిస్టర్ కూడా చేయించబోతున్నట్లుగా సమాచారం.