‘పహిల్వాన్’ ట్రైలర్ విడుదల... సెప్టెంబర్ 12న గ్రాండ్ రిలీజ్
శాండిల్ వుడ్ బాద్షా.. ‘ఈగ’ ఫేమ్ కిచ్చా సుదీప్ టైటిల్ పాత్రలో నటిస్తోన్న చిత్రం ‘పహిల్వాన్’. ఎస్.కృష్ణ దర్శకుడు. ఈ సినిమాను ప్రముఖ నిర్మాణ సంస్థ వారాహి చలన చిత్రం తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు. ఈ యాక్షన్ డ్రామాలో సుదీప్ రెజ్లర్ పాత్రలో కనిపిస్తారు. తెలుగులోనూ ‘పహిల్వాన్’ అనే పేరుతో సెప్టెంబర్ 12న ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు.
ఈ చిత్రంలో బాలీవుడ్ నటుడు సునీల్ శెట్టి, ఆకాంక్ష సింగ్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇటీవల మెగాస్టార్ చిరంజీవి విడుదల చేసిన ‘పహిల్వాన్’ ఫస్ట్ లుక్ పోస్టర్‌కు మంచి స్పందన వచ్చింది. గురువారం ఈ సినిమా ట్రైలర్‌ను విడుదల చేశారు. ఈ ట్రైలర్‌కు ట్రెమెండస్ రెస్పాన్స్ వస్తుంది.
అర్జున్ జన్యా సంగీతం అందించిన ఈ సినిమాకు కరుణాకర్ సినిమాటోగ్రఫీ అందించారు. ‘కె.జి.యఫ్’ చిత్రాన్ని తెలుగులో విడుదల చేసి ఘన విజయాన్ని అందుకున్న వారాహి చలన చిత్రం ఇప్పుడు ‘పహిల్వాన్’ చిత్రాన్ని సెప్టెంబర్ 12న గ్రాండ్ రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.
రచన, దర్శకత్వం: ఎస్.కృష్ణ
బ్యానర్: వారాహి చలన చిత్రం
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: ఎస్.దేవరాజ్
కెమెరా: కరుణాకర్.ఎ
ఎడిటర్: రూబెన్
ప్రొడక్షన్ డిజైనర్: శివకుమార్
కుస్తీ: ఎ.విజయ్
బాక్సింగ్: లార్లెల్ స్టోవాల్
స్టంట్స్: రామ్ లక్ష్మణ్, కె.రవివర్మ
కొరియోగ్రఫీ: గణేశ్ ఆచార్య, రాజు సుందరం
ప్రొడక్షన్ కంట్రోలర్: సాగర్ గౌడ
స్క్రీన్‌ప్లే: కృష్ణ, మధు, కన్నన్
డైలాగ్స్: హనుమాన్ చౌదరి
పాటలు: రామజోగయ్యశాస్త్రి
వి.ఎఫ్.ఎక్స్: రెడ్ చిల్లీస్, లైబ్రింత్
డి.ఐ: ప‌్రసాద్ ల్యా్స్(ముంబై)
కాస్ట్యూమ్స్: యోగి, చేతన్, గణేశ్
ప్రొడక్షన్ మేనేజర్: మైసూర్ సురేశ్
డైరెక్షన్ టీం: వికాస్ విశ్వనాథ్, ప్రద్యుమ్న నరహల్లి, అనీల్ విజ్జి, తేజ్ వర్ధన్
స్టిల్స్: కదూర్ రఘు
పబ్లిసిటీ డిజైన్: ధని ఏలే, కానీ స్టూడియో