Advertisement
Google Ads BL

ప్రభాస్ ‘సాహో’ చేయడానికి కారణం అవేనంట?


మరో ఎనిమిది రోజుల్లో వరల్డ్ వైడ్ గా భారీగా విడుదల కాబోతున్న సాహో సినిమాపై అంచనాలు గంటగంటకు పెరిగిపోతున్నాయి. ప్రభాస్ - శ్రద్దాకపూర్ జంటగా తెరకెక్కిన సాహో సినిమాపై వరల్డ్ వైడ్ గా భారీ అంచనాలే ఉన్నాయి. ఆ అంచనాలు సాహో తప్పక అందుకుంటుందని ధీమాతో సాహో టీం ఉంది. ఇక ప్రభాస్ కూడా ముంబై లోనే మకాం వేసి నేషనల్ మీడియాకి తెగ ఇంటర్వూస్ ఇవ్వడమే కాదు... అక్కడ స్పెషల్ షోస్ అంటే బుల్లితెర మీద పాపులర్ షోస్ లో తన హీరోయిన్స్ తో కలిసి సాహో సినిమాని ప్రమోట్ చేస్తున్నాడు. ఇక ఈ సినిమాని దర్శకుడు సుజిత్ చాలా బాగా హ్యాండిల్ చేసాడని సాహో మేకింగ్స్ లోను, ట్రైలర్ తోనూ అందరూ ఓ అంచనాకి వచ్చేసారు. సాహో మొత్తం భారీ యాక్షన్ తో నిండిపోయి హాలీవుడ్ సినిమాలని తలపిస్తుంది.

Advertisement
CJ Advs

అయితే సాహోకి మెయిన్ హైలెట్స్ రెండే రెండు ట్విస్ట్స్ అంటూ ప్రచారం జరుగుతుంది. అందులో మెయిన్ గా క్లైమాక్స్ ట్విస్ట్ ఒకటి కాగా.. రెండోది ఇంటర్వెల్ బ్యాంగ్ ట్విస్ట్ అంటున్నారు. క్లైమాక్స్ లో వ‌చ్చే ట్విస్ట్ ప్రేక్షకులకు థ్రిల్ క‌లిగిస్తుంద‌ని తెలుస్తోంది. అప్ప‌టి వ‌ర‌కూ న‌డిచిన క‌థ ఒక ఎత్త‌యితే… ఆ ట్విస్టు మ‌రో ఎత్తు అంటూ ప్రచారం జరుగుతుంది. 

అలాగే ఇంటర్వెల్ బ్యాంగ్ లో వచ్చే ట్విస్ట్ కూడా అందరిని ఆశ్చర్యంలో పడేస్తుందట. అసలు క్లైమాక్స్ ట్విస్ట్ తో పాటుగా ఇంటర్వెల్ ట్విస్ట్స్ నచ్చే ప్రభాస్ సాహో కథకి ఒకే చెప్పాడంటున్నారు. అలాగే సినిమాలో ఒక యాక్షన్ పార్ట్ అంటే ఓ 15 నిమిషాల పాటు వచ్చే ఓ భారీ యాక్షన్ ఎపిసోడ్ కూడా సినిమాకి మెయిన్ హైలెట్ గా నిలవబోతుందట. మరి ఇంటర్వెల్ ట్విస్ట్, క్లైమాక్స్ ట్విస్ట్ లే సినిమాకి కీలకం అన్నట్టుగా మాట్లాడుకుంటున్నారు. చూద్దాం సాహో లో ఏది హైలెట్ అనేది మరో వారంలో తేలిపోతుంది.

Saaho Highlights Scenes Revealed:

Interval and Climax Highlight in Saaho Movie
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs