Advertisement
Google Ads BL

‘సైరా’కు బాలీవుడ్‌లో అడ్డెవరు?


నాలుగు భాషల్లో గ్రాండ్‌గా విడుదల కాబోతున్న సైరా ప్రమోషన్స్ ముంబై వేదికగా మొదలైపోయాయి. నిన్నమొన్నటివరకు సై రా పోస్టర్స్ మోత మోగించిన సై రా టీం నిన్నటినుండి టీజర్ తో హంగామా చేస్తుంది. నాలుగు భాషల్లో భారీ ఎత్తున అక్టోబర్ 2 న విడుదలకాబోతున్న సైరా నరసింహారెడ్డి సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. ఇండియా వైడ్‌గా మంచి బిజినెస్ చేస్తున్న సై‌రా సినిమా ఎక్కువగా హిందీ మార్కెట్ మీద ఫోకస్ పెట్టింది. అందుకే సినిమా టీం మొత్తం ముంబై లో మీడియా సమావేశంతో పాటుగా పలు నేషనల్ ఛానల్స్ కి ఇంటర్వూస్ ఇస్తూ బిజీగా గడిపేస్తుంది. 

Advertisement
CJ Advs

ఇక అన్ని భాషల్లోనూ మెగాస్టార్ చిరు సైరా కి ఎదురు నిలబడడానికి ఎవ్వరూ ముందుకు రాలేదు కానీ.. బాలీవుడ్ మాత్రం సైరాకి హృతిక్ రోషన్ వార్ తో టెన్షన్స్ పెడుతున్నాడు. సైరాని ఎంత భారీగా విడుదల చేసినా.. హిందీలో హృతిక్, టైగర్ ష్రాఫ్ నటించిన వార్ అంత కాదు. మొన్నామధ్యన విడుదల చేసిన వార్ టీజర్ చూస్తే సినిమా మీద ఎంత అంచనాలున్నాయో తెలుస్తుంది. ఒకే ఒక్క టీజర్ తో వార్ మీద అంచనాలు పెరిగి సైరా బృందానికి టెన్షన్ మొదలయ్యింది. అక్టోబర్ 2న తమకి గట్టి పోటీ ఇచ్చేది వార్ అని ఫిక్స్ అయ్యారు కూడా.

వార్ సినిమా కూడా సాహోలాగా భారీ యాక్షన్ సన్నివేశాలతో నిండిపోయి సినిమా మీద అందరిలో ఆసక్తిని క్రియేట్ చేసింది. సైరా మాత్రం ఓ స్వాతంత్య్ర సమరయోధుడి చారిత్రాత్మక కథతో తెరకెక్కింది. మరి యాక్షన్ సినిమా మీదున్న ఇంట్రెస్ట్ చారిత్రాత్మక సినిమాల మీద ఎక్కువ కలగదు. అయితే తాజాగా వార్ కి విడుదల కష్టాలు మొదలైనట్టుగా టాక్. అదేమంటే యశ్ రాజ్ ఫిలింస్ వార్ సినిమాని భారీ బడ్జెట్‌తో తెరకెక్కించింది. అయితే గతంలో యశ్ రాజ్ ఫిలిమ్స్ వారు తెరకెక్కించిన థగ్స్ ఆఫ్ హిందుస్థాన్ మీదున్న అంచనాలతో భారీ రేట్లకి బయ్యర్లకి ఆ సినిమాని ఆమ్మేశారట. 

అయితే ఆ థగ్స్ ఆఫ్ హిందుస్థాన్ అంచనాలను తల్లకిందులు చేస్తూ భారీ ప్లాప్ అవడంతో.. భారీగా నష్టపోయిన బయ్యర్లు యశ్ రాజ్ ఫిలిమ్స్ వారిని తమకి కొంత మొత్తం సెటిల్ చెయ్యమని అడిగితే వారు ససేమిరా అన్నారట. అయితే ఆ విషయాన్నీ కడుపులో పెట్టుకున్న బయ్యర్లు ఇపుడు వార్ సినిమాని తక్కువ రేట్లకి అడుగుతుంటే యశ్ రాజ్ ఫిలిమ్స్ కుదరదని చెబుతుందట. అయితే బయ్యర్లంతా సిండికేట్ గా ఏర్పడి వార్ సినిమాని కొనవద్దనే నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తుంది. అదే జరిగితే వార్ వాయిదా పడడం ఖాయం. వార్ వాయిదా పడితే సైరా రెచ్చిపోవడం ఖాయం. అలా ప్రస్తుతానికికి వార్ వాయిదా న్యూస్ తో సై రా టీం ఆనంద పడుతున్నట్లుగా చెబుతున్నారు.

Sye Raa Narasimha Reddy Vs War:

Sye Raa vs War: Release Problems to War Movie In Bollywood
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs