Advertisement
Google Ads BL

‘సైరా’నీ లెక్కచేయని లేడీ సూపర్ స్టార్!


కోలీవుడ్‌లో లేడీ సూపర్ స్టార్‌గా వెలుగొందుతున్న నయనతార ఒక్కో సినిమాకి కోట్లలో రెమ్యునరేషన్ తీసుకుంటుంది కానీ.. ఆ సినిమా ప్రమోషన్స్ కి మాత్రం రాదు. నయనతారని ప్రమోషన్స్‌కి పిలవాలంటే నిర్మాతలకి ఒణుకు. తెలుగైనా, తమిళయినా, మళయాళమైన ఏదైనా నయనతార సినిమాలో నటిస్తుంది కానీ.. ప్రమోషన్స్‌కి మాత్రం రాదు. ఎమ్మా అంటే సెంటిమెంట్ అంటారు, కాదు ప్రమోషన్స్ కి స్పెషల్ రెమ్యునరేషన్ తీసుకుంటుందని అంటారు. అయితే నయనతార తాను నటించిన సినిమాల ప్రమోషన్స్ కి వెళ్లిన ఈవెంట్స్ వేళ్ళలో లెక్కెట్టొచ్చు. కాకపోతే ఈసారి నయనతార మెగాస్టార్ చిరంజీవితో కలిసి నటిస్తున్న సైరా నరసింహారెడ్డి సినిమా ప్రమోషన్స్‌లో పాల్గొంటుందని అనుకున్నారు అంతా.

Advertisement
CJ Advs

ఎందుకంటే నయనతార సైరా మూవీలో చాలా ముఖ్యమైన రోల్ చేస్తుంది. అందులోను సై రా నరసింహారెడ్డి సినిమా 5 భాషల్లో విడుదలకాబోతుంది.. మరి ప్రమోషన్స్‌కి హాజరైతే నయనతార మీద మీడియా స్పెషల్ ఫోకస్ పెట్టి మరీ హైలెట్ చేస్తుంది. దానితో నేషనల్ వైడ్ నయనతార పేరు మార్మోగుతుంది. అలాగే సైరా టీం కి బలం చేకూరేది. కానీ ముంబైలో జరిగిన సైరా నరసింహారెడ్డి టీజర్ లాంచ్ ఈవెంట్ కి చిరు, రామ్ చరణ్, సుదీప్, విజయ్ సేతుపతి లాంటి హీరోలంతా హాజరయ్యారు. ఇక ఓ కీ రోల్ ప్లే చేస్తున్న తమన్నా కూడా ఈ ఈవెంట్ కి హాజరైంది. కానీ నయన్ మాత్రం రాలేదు. 

అయితే సైరా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కో, ప్రీ రిలీజ్ ఈవెంట్‌కో నిర్మాత రామ్ చరణ్... నయనతారని ఒప్పించి తీసుకురావొచ్చనే ఊహాగానాలు ఉన్నాయి. ఇక నయనతార ఉయ్యాలవాడ నరసింహారెడ్డి భార్య పాత్రలో అద్భుతమైన అందంతో సైరాలో కనిపిస్తుంది. సైరాలో నయన్ లుక్ చాలా ప్రత్యేకంగా కనబడుతూ ఆపాత్రపై అంచనాలు పెంచేస్తుంది. 

No Nayanthara at Sye Raa Teaser Launch :

Nayanthara Not Interests Movie Promotions
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs