Advertisement
Google Ads BL

విజయ్ సేతుపతి ‘ఉప్పెన’ షూట్ మొదలైంది


పంజా వైష్ణవ్ తేజ్ ‘ఉప్పెన’ చిత్రీకరణలో పాల్గొంటున్న విజయ్ సేతుపతి

Advertisement
CJ Advs

మెగాస్టార్ చిరంజీవి మేనల్లుడు పంజా వైష్ణవ్ తేజ్ హీరోగా రూపొందుతోన్న చిత్రం ‘ఉప్పెన’. వైష్ణవ్ తేజ్ సరసన క్రితి శెట్టి హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ సినిమా షూటింగ్‌లో బుధవారం నుంచి తమిళ స్టార్ యాక్టర్ విజయ్ సేతుపతి పాల్గొంటున్నారు. సుకుమార్ వద్ద అసిస్టెంట్ డైరెక్టర్‌గా వర్క్ చేసిన బుచ్చిబాబు సానా ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. సారథి స్టూడియోలో ఆర్ట్ డైరెక్టర్స్ మోనిక, రామకృష్ణ వేసిన భారీ సెట్‌లో ప్రస్తుతం సినిమా చిత్రీకరణను జరపుకుంటోంది. ఈ షెడ్యూల్‌లో వైష్ణవ్ తేజ్, రాజీవ్ కనకాల, హీరోయిన్ క్రితి శెట్టి, అలాగే 500 మంది జూనియర్ ఆర్టిస్టులు కూడా పాల్గొంటున్నారు. ఇప్పటి వరకు 40 శాతం చిత్రీకరణను పూర్తి చేసుకుంది. రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తోన్న ఈ చిత్రానికి శాందత్ సైనుద్దీన్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. సుకుమార్ రైటింగ్స్, మైత్రీ మూవీ మేకర్స్ పతాకాలపై ఈ సినిమా నిర్మితమవుతోంది. 

న‌టీన‌టులు:

పంజా వైష్ణ‌వ్ తేజ్‌, విజ‌య్ సేతుప‌తి, క్రితి శెట్టి, రాజీవ్ కనకాల త‌దిత‌రులు 

సాంకేతిక నిపుణులు:

ర‌చ‌న‌, ద‌ర్శ‌క‌త్వం: బుచ్చిబాబు సానా

సి.ఇ.ఓ: చెర్రీ

బ్యాన‌ర్స్‌: మైత్రీ మూవీ మేక‌ర్స్‌, సుకుమార్ రైటింగ్స్

సినిమాటోగ్ర‌ఫీ: శాంద‌త్ సైనుద్దీన్‌

సంగీతం: దేవిశ్రీ ప్ర‌సాద్‌

ఎడిటింగ్‌: న‌వీన్ నూలి

ఆర్ట్‌: మోనిక రామ‌కృష్ణ‌

Vijay Sethupathi starts shooting for Panja Vaisshnav Tej’s Uppena:

Uppena Movie Shooting Update
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs